Title (Indic)ఇన్నిటా దొరవు నీవు యేమి నేసినాఁ జెల్లు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇన్నిటా దొరవు నీవు యేమి నేసినాఁ జెల్లు యెన్ని చూచితే నే నీయిచ్చలోనిదానను (॥॥) మంతనాన నీవు నాపె మాటలాడుకొన్న వెల్లా వింతగా మాటుననుండి వింటిమి నేము చెంత నామొగము చూచి సిగ్గువడ నిఁక నేల అంతటా సంతోసము నీకై తేనే మంచిది (॥॥) సరసాన మీరిద్దరు సన్నలు సేసుకొన్నవి గరిమతోఁ గన్నులారఁ గంటిమి నేము శిరసెత్తి నీవందుకు చిఱునవ్వు నవ్వనేల సుసర నీకవియెల్లా, చవులై తే మంచిది (॥॥) సులభాన మీరింతలో చుట్టాలై నందుకు కొలువువోఁ జూచి ఇయ్యకొంటిమి నేము వెలియ శ్రీవేంకటేశ వేఁడుకొన నింత యాల యిల నన్నుఁ గూడితివి యెట్టున్నా మంచిది English(||pallavi||) inniḍā dŏravu nīvu yemi nesinām̐ jĕllu yĕnni sūside ne nīyichchalonidānanu (||||) maṁtanāna nīvu nābĕ māḍalāḍugŏnna vĕllā viṁtagā māḍunanuṁḍi viṁṭimi nemu sĕṁta nāmŏgamu sūsi sigguvaḍa nim̐ka nela aṁtaḍā saṁtosamu nīgai tene maṁchidi (||||) sarasāna mīriddaru sannalu sesugŏnnavi garimadom̐ gannulāram̐ gaṁṭimi nemu śhirasĕtti nīvaṁdugu siṟunavvu navvanela susara nīgaviyĕllā, savulai te maṁchidi (||||) sulabhāna mīriṁtalo suṭṭālai naṁdugu kŏluvuvom̐ jūsi iyyagŏṁṭimi nemu vĕliya śhrīveṁkaḍeśha vem̐ḍugŏna niṁta yāla yila nannum̐ gūḍidivi yĕṭṭunnā maṁchidi