Title (Indic)ఇంతకంటెఁ బని నీకు నెంతగలదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇంతకంటెఁ బని నీకు నెంతగలదు కాంత యిచ్చలోనే వచ్చి కరుణించవలదా (॥ఇంత॥) చెతులెత్తి చేతులెత్తి చెలి సన్నసేయఁగాను ఆతల నేమిచూచే వప్పటినీవు కాతరించి రతులకు కన్నులనే మొక్కఁగాను యాతలఁ పెరఁగినీవు యెనయఁగవలదా (॥ఇంత॥) యెచ్చరించి యెచ్చరించి ఇంతి పూవుల వేయఁగా కొచ్చి జూజాలేమాడేవు గుట్టున నీవు కచ్చు పెచ్చుకొనివచ్చి కానుక నీకియ్యఁగాను అచ్చముగా మాఁటలాడి ఆదరించవలదా (॥ఇంత॥) వెడ్డువెట్టి వెడ్డువెట్టి వెలఁది కాఁగిలించఁగా వొడ్డుక యేమి నవ్వేవు వూరకే నీవు జిడ్డుదేరఁ జెనకఁగా శ్రీవేంకటేశ కూడితి - వడ్డాఁక లేక ఇట్టె అంది పొందవలదా English(||pallavi||) iṁtagaṁṭĕm̐ bani nīgu nĕṁtagaladu kāṁta yichchalone vachchi karuṇiṁchavaladā (||iṁta||) sĕdulĕtti sedulĕtti sĕli sannaseyam̐gānu ādala nemisūse vappaḍinīvu kādariṁchi radulagu kannulane mŏkkam̐gānu yādalam̐ pĕram̐ginīvu yĕnayam̐gavaladā (||iṁta||) yĕchchariṁchi yĕchchariṁchi iṁti pūvula veyam̐gā kŏchchi jūjālemāḍevu guṭṭuna nīvu kachchu pĕchchugŏnivachchi kānuga nīgiyyam̐gānu achchamugā mām̐ṭalāḍi ādariṁchavaladā (||iṁta||) vĕḍḍuvĕṭṭi vĕḍḍuvĕṭṭi vĕlam̐di kām̐giliṁcham̐gā vŏḍḍuga yemi navvevu vūrage nīvu jiḍḍuderam̐ jĕnagam̐gā śhrīveṁkaḍeśha kūḍidi - vaḍḍām̐ka lega iṭṭĕ aṁdi pŏṁdavaladā