Title (Indic)ఇంతకంటె మరి ఫల మేమని చెప్పఁగలదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇంతకంటె మరి ఫల మేమని చెప్పఁగలదు సంతతమైన వలపే సంసారఫలము (॥ఇంత॥) సతికి జవ్వనమె జన్మమందిన ఫలము పతి యాదరించినదె ఫలము మతికి నింపుగా మంచిమాటాడిన ఫలము అతికాంక్ష నెప్పుడుఁ బాయకుండుటే ఫలము (॥ఇంత॥) ననుపున మోముచూచినప్పుడు నవ్వుటే ఫలము చనవిచ్చి ఆడేసరసమే ఫలము మనసు తనివిదీర మర్మములంటుటే ఫలము కనుఁగొనఁ జూచిచూచి కరఁగుటే ఫలము (॥ఇంత॥) ప్రియముతో మేనుసోకఁ బెనఁగినదే ఫలము నయమునఁ జూపేటిసన్నయే ఫలము జయమై శ్రీవేంకటేశ్వర యలమేల్మంగను నియతి గూడితి విఁక నీవే ఫలము English(||pallavi||) iṁtagaṁṭĕ mari phala memani sĕppam̐galadu saṁtadamaina valabe saṁsāraphalamu (||iṁta||) sadigi javvanamĕ janmamaṁdina phalamu padi yādariṁchinadĕ phalamu madigi niṁpugā maṁchimāḍāḍina phalamu adigāṁkṣha nĕppuḍum̐ bāyaguṁḍuḍe phalamu (||iṁta||) nanubuna momusūsinappuḍu navvuḍe phalamu sanavichchi āḍesarasame phalamu manasu tanividīra marmamulaṁṭuḍe phalamu kanum̐gŏnam̐ jūsisūsi karam̐guḍe phalamu (||iṁta||) priyamudo menusogam̐ bĕnam̐ginade phalamu nayamunam̐ jūbeḍisannaye phalamu jayamai śhrīveṁkaḍeśhvara yalamelmaṁganu niyadi gūḍidi vim̐ka nīve phalamu