Title (Indic)ఇంతకంటఁ జెలులాల యేమి చెప్పే రతనికి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇంతకంటఁ జెలులాల యేమి చెప్పే రతనికి మంతుకెక్కి తన్నుఁ దానె మంచిదయ్యీఁ గాక (॥ఇంత॥) బుద్దులు నేఁ జెప్పనా పొందులు నేఁ జూపనా బద్దులకాంతల నట్టె పాయఁడుగాక గద్దించి నేఁ జూడనా కన్నుల జంకించనా పెద్దరికపువారితోఁ బెనఁగీఁగాక (॥ఇంత॥) పొంకానకు దిద్దుకోనా పొంచి పరాకుసేయనా మంకుఁజీఁకటి తప్పులు మానఁడుగాక లంకెసేసుక వుండనా లావులెల్లఁ జూపనా బింకపువారిమాటలు ప్రియపడీఁగాక (॥ఇంత॥) కందువ నేఁ గూడనా కాఁగిలించుకొననా చెంది వారిగుణా లీడఁ జెప్పీఁగాక అందపుశ్రీవేంకటేశుఁ డాతఁడే నేఁ గానా మందెమేళాలేలో తొట్టి మరిగీఁగాక English(||pallavi||) iṁtagaṁṭam̐ jĕlulāla yemi sĕppe radanigi maṁtugĕkki tannum̐ dānĕ maṁchidayyīm̐ gāga (||iṁta||) buddulu nem̐ jĕppanā pŏṁdulu nem̐ jūbanā baddulagāṁtala naṭṭĕ pāyam̐ḍugāga gaddiṁchi nem̐ jūḍanā kannula jaṁkiṁchanā pĕddarigabuvāridom̐ bĕnam̐gīm̐gāga (||iṁta||) pŏṁkānagu diddugonā pŏṁchi parāguseyanā maṁkum̐jīm̐kaḍi tappulu mānam̐ḍugāga laṁkĕsesuga vuṁḍanā lāvulĕllam̐ jūbanā biṁkabuvārimāḍalu priyabaḍīm̐gāga (||iṁta||) kaṁduva nem̐ gūḍanā kām̐giliṁchugŏnanā sĕṁdi vāriguṇā līḍam̐ jĕppīm̐gāga aṁdabuśhrīveṁkaḍeśhum̐ ḍādam̐ḍe nem̐ gānā maṁdĕmeḽālelo tŏṭṭi marigīm̐gāga