Title (Indic)ఇంతటిది గలిగితే నీడేరు వలపులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇంతటిది గలిగితే నీడేరు వలపులు వింతతనము గానిదే వెస ఘనురాలు (॥ఇంత॥) వొగ్గి రమణుఁడు తన వొడివట్టి తీసినాను సిగ్గుతోడ నుండినదే చెలియ కగ్గులేక యాతఁడే కాతరించి చెనకితే అగ్గమై వోరిచినదే యన్నిటా నేరుపరి (॥ఇంత॥) కూరిమితోడుతఁ బతి కొంగువట్టి పెనఁగితే మేరలు మీరనిదే మెలుఁత కోరి మర్మములెల్లా కొనగోర నంటితే ఆరీతి నాడుకోనిదే యన్నిటా నేరుపరి (॥ఇంత॥) కప్పి శ్రీవేంకటేశుఁడు కాఁగిలించి కూడితేను వొప్పుకొని పాయనిదే వువిద తప్పక వోచెలులాల తమలో సమ్మతులైతే అప్పుడే గుట్టుసేసిన దన్నిటా నేరుపరి English(||pallavi||) iṁtaḍidi galigide nīḍeru valabulu viṁtadanamu gānide vĕsa ghanurālu (||iṁta||) vŏggi ramaṇum̐ḍu tana vŏḍivaṭṭi tīsinānu siggudoḍa nuṁḍinade sĕliya kaggulega yādam̐ḍe kādariṁchi sĕnagide aggamai vorisinade yanniḍā nerubari (||iṁta||) kūrimidoḍudam̐ badi kŏṁguvaṭṭi pĕnam̐gide meralu mīranide mĕlum̐ta kori marmamulĕllā kŏnagora naṁṭide ārīdi nāḍugonide yanniḍā nerubari (||iṁta||) kappi śhrīveṁkaḍeśhum̐ḍu kām̐giliṁchi kūḍidenu vŏppugŏni pāyanide vuvida tappaga vosĕlulāla tamalo sammadulaide appuḍe guṭṭusesina danniḍā nerubari