Title (Indic)ఇందరివలెఁ జూడకు యింకా నన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇందరివలెఁ జూడకు యింకా నన్ను మందలించి యెటువలె మన్నించినా మంచిదే (॥॥) తత్తరించి నీమీఁద తప్పులు మోపఁగ నోప కొత్త కొత్త మాటలను కొసర నోప బత్తిగలదాన నీతోఁ బంతము లాడఁగ నోప చిత్తగించి యేమి దయసేసినాను మంచిదే (॥॥) చేయి చాఁచి కొనగోరఁ జెనకఁగ నే నోప చాయల సన్నల నిన్ను జరయ నోప నీ యాధీనపు దానను నిన్ను వెంగెమాడ నోప రాయడించ కెటువలె రక్షించినా మంచిదే (॥॥) అట్టే కాఁగిటఁ గూడితి నలయించ నే నోప వట్టి సటలాడి నీతో వాదించ నోప ఇట్టే శ్రీవేంకటేశ యెనసితివిటు నన్ను పట్టిముగట్టి నన్నెంత పాలార్చినా మంచిదే English(||pallavi||) iṁdarivalĕm̐ jūḍagu yiṁkā nannu maṁdaliṁchi yĕḍuvalĕ manniṁchinā maṁchide (||||) tattariṁchi nīmīm̐da tappulu mobam̐ga noba kŏtta kŏtta māḍalanu kŏsara noba battigaladāna nīdom̐ baṁtamu lāḍam̐ga noba sittagiṁchi yemi dayasesinānu maṁchide (||||) seyi sām̐si kŏnagoram̐ jĕnagam̐ga ne noba sāyala sannala ninnu jaraya noba nī yādhīnabu dānanu ninnu vĕṁgĕmāḍa noba rāyaḍiṁcha kĕḍuvalĕ rakṣhiṁchinā maṁchide (||||) aṭṭe kām̐giḍam̐ gūḍidi nalayiṁcha ne noba vaṭṭi saḍalāḍi nīdo vādiṁcha noba iṭṭe śhrīveṁkaḍeśha yĕnasidiviḍu nannu paṭṭimugaṭṭi nannĕṁta pālārsinā maṁchide