Title (Indic)ఇది యేమె వీని గుణ మెటువంటిదే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇది యేమె వీని గుణ మెటువంటిదే వదలక నవ్వ నూరవదినెనా నేను (॥ఇది॥) చక్కనివాఁ డైతేఁ దానె చల్లఁగా నుండుఁ గాక యిక్కడ నెవ్వరి భ్రమయించ వచ్చీనె వక్కణలమాఁటలకు వలచి వెంటఁ దిరుగ తక్కరి రేపల్లె గొల్లదాననా యేమి (॥ఇది॥) పాయపువాఁ డైతేను బదుక నీవె యిట్టె కాయక మై యెవ్వరిపైఁ గన్ను లార్చీనె సోయగ మై తనమోము చూచి నట్టె మోహించి పాయకుండ మేనవారిపడుచనా నేను (॥ఇది॥) నేరుపది దా నైతె నెమ్మది నుండుఁ గాక కేరి కేరి యెవ్వరిపై గేలు చాఁచీనె చేర వచ్చి నెల్లూరి శ్రీవెంకటనాథుఁ డిట్టె యీరీతినె ననుఁ గడె యిందిరనా నేను. English(||pallavi||) idi yemĕ vīni guṇa mĕḍuvaṁṭide vadalaga navva nūravadinĕnā nenu (||idi||) sakkanivām̐ ḍaidem̐ dānĕ sallam̐gā nuṁḍum̐ gāga yikkaḍa nĕvvari bhramayiṁcha vachchīnĕ vakkaṇalamām̐ṭalagu valasi vĕṁṭam̐ diruga takkari reballĕ gŏlladānanā yemi (||idi||) pāyabuvām̐ ḍaidenu baduga nīvĕ yiṭṭĕ kāyaga mai yĕvvaribaim̐ gannu lārsīnĕ soyaga mai tanamomu sūsi naṭṭĕ mohiṁchi pāyaguṁḍa menavāribaḍusanā nenu (||idi||) nerubadi dā naidĕ nĕmmadi nuṁḍum̐ gāga keri keri yĕvvaribai gelu sām̐sīnĕ sera vachchi nĕllūri śhrīvĕṁkaḍanāthum̐ ḍiṭṭĕ yīrīdinĕ nanum̐ gaḍĕ yiṁdiranā nenu.