Title (Indic)ఇద్దరి మీ సరసము లేమని చెప్పఁగవచ్చు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరి మీ సరసము లేమని చెప్పఁగవచ్చు చద్దికి వేఁడికి సంతోషములెన్నోకాని (॥ఇద్ద॥) ఇదె చనవు మనువు లిన్ని నీతోఁ జెప్పీని సుదతి నీకెటువంటి చుట్టమోకాని గుదిగొని సారెసారెఁ గొలువులు సేసీని పొదిగి నీయెడ కెంత పొందోకాని (॥ఇద్ద॥) మునుకొని సన్నలు నీముందరనే సేసీని యెనసిన పను లవి యెట్టివోకాని పెనఁగుచు వేఁడుకొని ప్రియములు చెప్పీని వొనరిన దెటువంటి వొడఁ బాటోకాని (॥ఇద్ద॥) నగుతానే సొలయుచు నయములు చూపీని మొగమోట మెటువంటి ముచ్చటోకాని ఆ(అ?) గపడి శ్రీవేంకటాధిప నిన్నుఁ బెండ్లాడె మగువకు నీకు నెంత మచ్చికోకాని English(||pallavi||) iddari mī sarasamu lemani sĕppam̐gavachchu saddigi vem̐ḍigi saṁtoṣhamulĕnnogāni (||idda||) idĕ sanavu manuvu linni nīdom̐ jĕppīni sudadi nīgĕḍuvaṁṭi suṭṭamogāni gudigŏni sārĕsārĕm̐ gŏluvulu sesīni pŏdigi nīyĕḍa kĕṁta pŏṁdogāni (||idda||) munugŏni sannalu nīmuṁdarane sesīni yĕnasina panu lavi yĕṭṭivogāni pĕnam̐gusu vem̐ḍugŏni priyamulu sĕppīni vŏnarina dĕḍuvaṁṭi vŏḍam̐ bāḍogāni (||idda||) nagudāne sŏlayusu nayamulu sūbīni mŏgamoḍa mĕḍuvaṁṭi muchchaḍogāni ā(a?) gabaḍi śhrīveṁkaḍādhiba ninnum̐ bĕṁḍlāḍĕ maguvagu nīgu nĕṁta machchigogāni