Title (Indic)ఇతర మేదియు లేదు యెఱఁగ మింతేకాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతర మేదియు లేదు యెఱఁగ మింతేకాని రతికెక్కే పనులెల్లా రామచంద్రుఁడే పో (॥ఇత॥) ధనమై చేరేవాఁడు దైవమై కాచే వాఁడు మనసులోదలఁచేటి మాధవుఁడే మునుకొన్న గ్రామములై ముందర నుండే వాఁడు కొననాలుక మీఁదటి గోవిందుఁడే పో (॥ఇత॥) తల్లియై పెంచేవాఁడు తండ్రియై పుట్టించే వాఁడు వెల్లవిరిఁ దాఁగొలిచే విష్ణుమూరితి ఇల్లాలై సుఖమిచ్చి యెంచఁ బుత్రులైన వాఁడు చెల్లుబడిఁ దామొక్కేటి చేతిపై శ్రీహరియే (॥ఇత॥) దేహమై వుండేటివాఁడు దినభోగమైన వాఁడు యీహల శ్రీవేంకటేశుఁడితఁ డొక్కఁడే మోహాచారమైన వాఁడు మోక్షమై నిలిచే వాఁడు సాహసించి నమ్మఁగల సర్వేశుఁడితడే English(||pallavi||) idara mediyu ledu yĕṟam̐ga miṁtegāni radigĕkke panulĕllā rāmasaṁdrum̐ḍe po (||ida||) dhanamai serevām̐ḍu daivamai kāse vām̐ḍu manasulodalam̐seḍi mādhavum̐ḍe munugŏnna grāmamulai muṁdara nuṁḍe vām̐ḍu kŏnanāluga mīm̐daḍi goviṁdum̐ḍe po (||ida||) talliyai pĕṁchevām̐ḍu taṁḍriyai puṭṭiṁche vām̐ḍu vĕllavirim̐ dām̐gŏlise viṣhṇumūridi illālai sukhamichchi yĕṁcham̐ butrulaina vām̐ḍu sĕllubaḍim̐ dāmŏkkeḍi sedibai śhrīhariye (||ida||) dehamai vuṁḍeḍivām̐ḍu dinabhogamaina vām̐ḍu yīhala śhrīveṁkaḍeśhum̐ḍidam̐ ḍŏkkam̐ḍe mohāsāramaina vām̐ḍu mokṣhamai nilise vām̐ḍu sāhasiṁchi nammam̐gala sarveśhum̐ḍidaḍe