Title (Indic)ఇతర కాంతలు చూచి యేమని నవ్వుదురో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతర కాంతలు చూచి యేమని నవ్వుదురో రతివేళ చేఁతలు మరఁగుచేయఁ గదవే (॥ఇత॥) సమరతి యాతనితో సలుపఁగాఁ బొడమిన- చెమటార విసరవే చెలువునికి తమల మప్పుడు నీకు తమితోడఁ బెట్టెనేమో అమర వేరొక్కవిడెమంది చేతికియ్యవే (॥ఇత॥) కప్పుకొన్నవచ్చడము కడునెరి విరిగెను యెప్పటివలెనే విచ్చి యియ్యఁగదవే లప్పలై గందము రాలీ లావునఁ బెనఁగెనేమో చొప్పెఱఁగకుండాఁ గస్తూరి మీఁదఁ బూయవే (॥ఇత॥) సరసమాడఁగనేమో తురుము వీడివున్నది విరులు ముడువవే వేవేగను అరిది శ్రీవేంకటేశుఁ డలమేల్మంగవిభుఁడు నెరులచిక్కు దిద్దవే నెట్టన నన్నేలెను English(||pallavi||) idara kāṁtalu sūsi yemani navvuduro radiveḽa sem̐talu maram̐guseyam̐ gadave (||ida||) samaradi yādanido salubam̐gām̐ bŏḍamina- sĕmaḍāra visarave sĕluvunigi tamala mappuḍu nīgu tamidoḍam̐ bĕṭṭĕnemo amara verŏkkaviḍĕmaṁdi sedigiyyave (||ida||) kappugŏnnavachchaḍamu kaḍunĕri virigĕnu yĕppaḍivalĕne vichchi yiyyam̐gadave lappalai gaṁdamu rālī lāvunam̐ bĕnam̐gĕnemo sŏppĕṟam̐gaguṁḍām̐ gastūri mīm̐dam̐ būyave (||ida||) sarasamāḍam̐ganemo turumu vīḍivunnadi virulu muḍuvave veveganu aridi śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁgavibhum̐ḍu nĕrulasikku diddave nĕṭṭana nannelĕnu