Title (Indic)ఇటమీఁది కడమెల్లా నిఁక నీవు దీర్చవయ్యా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇటమీఁది కడమెల్లా నిఁక నీవు దీర్చవయ్యా పటుకునఁ జెలి నీకుఁ బాలువెట్టీ నిదిగో (॥ఇట॥) నెలఁత మంచము పై కిన్నెర వాయించి వాయించి తలకొని నీవు రాఁగాఁ దలవంచెను సొలసి చెలులతోడ సుద్దులు దాఁజెప్పిచెప్పి చెలఁగి నీ మోము చూచి సిగ్గువడీ నిదిగో (॥ఇట॥) పడఁతి నీమీఁదిపాట పాడిపాడి అర్థము నీ- వడిగితే నవ్వలి మోమై నవ్వీని అడియాలములరూపు అద్దములోఁ జూచి చూచి కడు నీవు కొంగువట్టఁగా భ్రమసీని (॥ఇట॥) సతి యేకతాన నుండి జవ్వాది పూసిపూసి రతి నీవు గూడఁగా సరసమాడిని ఇతవైన శ్రీ వేంకటేశ నీ వాపెఁ గూడఁగా పతి చూచి యిప్పు డిట్టె పక్కున నవ్వీని English(||pallavi||) iḍamīm̐di kaḍamĕllā nim̐ka nīvu dīrsavayyā paḍugunam̐ jĕli nīgum̐ bāluvĕṭṭī nidigo (||iḍa||) nĕlam̐ta maṁchamu pai kinnĕra vāyiṁchi vāyiṁchi talagŏni nīvu rām̐gām̐ dalavaṁchĕnu sŏlasi sĕluladoḍa suddulu dām̐jĕppisĕppi sĕlam̐gi nī momu sūsi sigguvaḍī nidigo (||iḍa||) paḍam̐ti nīmīm̐dibāḍa pāḍibāḍi ardhamu nī- vaḍigide navvali momai navvīni aḍiyālamularūbu addamulom̐ jūsi sūsi kaḍu nīvu kŏṁguvaṭṭam̐gā bhramasīni (||iḍa||) sadi yegadāna nuṁḍi javvādi pūsibūsi radi nīvu gūḍam̐gā sarasamāḍini idavaina śhrī veṁkaḍeśha nī vābĕm̐ gūḍam̐gā padi sūsi yippu ḍiṭṭĕ pakkuna navvīni