Title (Indic)ఇటమీఁద సతి నిన్ను సేమి సేసునో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇటమీఁద సతి నిన్ను సేమి సేసునో తటుకున మీఁదటెత్తు తలఁచుకో యిపుడు (॥ఇట॥) తెఱవ కన్నుల నిద్రదేరేది మానిపేనంటా మఱిచన్నులు విసికి మలసితివి జఱసి యందుకుఁగాను జంకించె ఆకెఁ(కె?) దిట్టితే తఱి పూవులచెండునఁ దాఁకవేసే విదివో (॥ఇట॥) వనితయలఁతపరవశము మానిసేనంటా కొనగోర చెక్కు చురుకున నూఁదితి పెనచి యందుకు నాకె బిగియించి పట్టితేను మొనసి యట్టె కప్రములు చల్లేవిదివో (॥ఇట॥) ఇంతి నిన్నుఁ గూడినచొక్కిట్టె మానిపేనంటా కాంతకెమ్మోవిమీఁద గంటిసేసితి చెంత నందుకుఁగా నవ్వె శ్రీవేంకటేశ నిన్నాకె పంతాన పన్నీరు పైపైఁ జల్లే విదివో English(||pallavi||) iḍamīm̐da sadi ninnu semi sesuno taḍuguna mīm̐daḍĕttu talam̐sugo yibuḍu (||iḍa||) tĕṟava kannula nidraderedi mānibenaṁṭā maṟisannulu visigi malasidivi jaṟasi yaṁdugum̐gānu jaṁkiṁchĕ āgĕm̐(kĕ?) diṭṭide taṟi pūvulasĕṁḍunam̐ dām̐kavese vidivo (||iḍa||) vanidayalam̐tabaravaśhamu mānisenaṁṭā kŏnagora sĕkku suruguna nūm̐didi pĕnasi yaṁdugu nāgĕ bigiyiṁchi paṭṭidenu mŏnasi yaṭṭĕ kapramulu sallevidivo (||iḍa||) iṁti ninnum̐ gūḍinasŏkkiṭṭĕ mānibenaṁṭā kāṁtagĕmmovimīm̐da gaṁṭisesidi sĕṁta naṁdugum̐gā navvĕ śhrīveṁkaḍeśha ninnāgĕ paṁtāna pannīru paibaim̐ jalle vidivo