Title (Indic)ఇటమీఁద నీచిత్తము యెఱుకగలవాఁడవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇటమీఁద నీచిత్తము యెఱుకగలవాఁడవు తటుకన నింకానేమి దండమువెట్టేను (॥ఇట॥) కోరినకోరిక నీవు గుఱి నీచక్కఁదనము వేరే నీకు నిఁకనేమి విన్నవించేను జారె నాపయ్యద నీకు చన్నులివి కానుకాయ గారవాన నిఁకనేమి కప్పమిచ్చేను (॥ఇట॥) అంగము నీవద్దనుండి ఆయము నీచేతిది అంగవించి యెందాఁకాఁ బ్రియము చెప్పేనే ముంగిట వెరగందితి ముట్టితివి నీవు నన్ను యెంగిలిమోవివిందు లేమి చెప్పేను (॥ఇట॥) గక్కనఁ గూడితి నిన్ను కాఁగిలి నీసొమ్మాయ చిక్కించు కెంతతడవు సేసవెట్టేను అక్కున శ్రీవేంకటేశ ఆలను నీవు పతివి పక్కన మరేమి నిన్ను బాసగొనేను English(||pallavi||) iḍamīm̐da nīsittamu yĕṟugagalavām̐ḍavu taḍugana niṁkānemi daṁḍamuvĕṭṭenu (||iḍa||) korinagoriga nīvu guṟi nīsakkam̐danamu vere nīgu nim̐kanemi vinnaviṁchenu jārĕ nābayyada nīgu sannulivi kānugāya gāravāna nim̐kanemi kappamichchenu (||iḍa||) aṁgamu nīvaddanuṁḍi āyamu nīsedidi aṁgaviṁchi yĕṁdām̐kām̐ briyamu sĕppene muṁgiḍa vĕragaṁdidi muṭṭidivi nīvu nannu yĕṁgilimoviviṁdu lemi sĕppenu (||iḍa||) gakkanam̐ gūḍidi ninnu kām̐gili nīsŏmmāya sikkiṁchu kĕṁtadaḍavu sesavĕṭṭenu akkuna śhrīveṁkaḍeśha ālanu nīvu padivi pakkana maremi ninnu bāsagŏnenu