Title (Indic)ఇతఁడు చేసిన సేఁత లెన్ని లేవిలమీఁద WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతఁడు చేసిన సేఁత లెన్ని లేవిలమీఁద యితఁడు జగదేకగర్వితుఁడౌనో కాఁడో (॥ఇతఁ॥) కుడువఁడా ప్రాణములుగొనుచుఁ బూతకిచన్ను తుడువఁడా కపటదైత్యులనొసలి వ్రాలు అడువఁడా నేలతో నలమి శకటాసురుని వడువఁడా నెత్తురులు వసుధ కంసునివి (॥ఇతఁ॥) పెట్టఁడా దనుజారిబిరుదు లోకమునందు కట్టఁడా బలిదైత్యు కర్మబంధముల మెట్టఁడా కాళింగు మేటిశిరములు, నలియఁ- గొట్టఁడా దానవులఁ గోటానఁగోట్ల (॥ఇతఁ॥) మరపఁడా పుట్టువులు మరణములుఁ బ్రాణులకు పరపఁడా గంగఁ దనపాదకమలమున చెరుపఁడా దురితములు శ్రీ వెంకటేశుఁడిదె నెరపఁడా లోకములనిండఁ దనకీర్తి English(||pallavi||) idam̐ḍu sesina sem̐ta lĕnni levilamīm̐da yidam̐ḍu jagadegagarvidum̐ḍauno kām̐ḍo (||idam̐||) kuḍuvam̐ḍā prāṇamulugŏnusum̐ būdagisannu tuḍuvam̐ḍā kabaḍadaityulanŏsali vrālu aḍuvam̐ḍā nelado nalami śhagaḍāsuruni vaḍuvam̐ḍā nĕtturulu vasudha kaṁsunivi (||idam̐||) pĕṭṭam̐ḍā danujāribirudu logamunaṁdu kaṭṭam̐ḍā balidaityu karmabaṁdhamula mĕṭṭam̐ḍā kāḽiṁgu meḍiśhiramulu, naliyam̐- gŏṭṭam̐ḍā dānavulam̐ goḍānam̐goṭla (||idam̐||) marabam̐ḍā puṭṭuvulu maraṇamulum̐ brāṇulagu parabam̐ḍā gaṁgam̐ danabādagamalamuna sĕrubam̐ḍā duridamulu śhrī vĕṁkaḍeśhum̐ḍidĕ nĕrabam̐ḍā logamulaniṁḍam̐ danagīrdi