Title (Indic)ఇతఁడే పరబ్రహ్మ మిదియే రామకథ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతఁడే పరబ్రహ్మ మిదియే రామకథ శతకోటివిస్తరము సర్వపుణ్యఫలము (॥ఇతడే॥) ధరలో రాముఁడు పుట్టె ధరణిజఁ బెండ్లాడె అరణ్య వాసుల కెల్లా నభయమిచ్చె సొరిది ముక్కుఁ జెవులు చుప్పనాతిని గోసె ఖర దూషణులను ఖండించి వేసె (॥ఇతడే॥) కినసి వాలిఁ జంపి కిష్కింధ సుగ్రీవు కిచ్చె వనధి బంధించి దాఁటె వానరులతో కనలి రావణ కుంభ కర్ణాదులను జంపి వనితఁ జేకొని మళ్ళి వచ్చె నయోధ్యకును (॥ఇతడే॥) సౌమిత్రియు భరతుఁడు శత్రుఘ్నుఁడుఁ గొలువఁగ భూమి యేలె కుశలవ పుత్రలఁ గాంచె శ్రీ మంతుఁడై నిలిచె శ్రీ వేంకటాద్రిమీఁద కామించి విభీషణ లంకకుఁ బట్టము గట్టె English(||pallavi||) idam̐ḍe parabrahma midiye rāmagatha śhadagoḍivistaramu sarvabuṇyaphalamu (||idaḍe||) dharalo rāmum̐ḍu puṭṭĕ dharaṇijam̐ bĕṁḍlāḍĕ araṇya vāsula kĕllā nabhayamichchĕ sŏridi mukkum̐ jĕvulu suppanādini gosĕ khara dūṣhaṇulanu khaṁḍiṁchi vesĕ (||idaḍe||) kinasi vālim̐ jaṁpi kiṣhkiṁdha sugrīvu kichchĕ vanadhi baṁdhiṁchi dām̐ṭĕ vānarulado kanali rāvaṇa kuṁbha karṇādulanu jaṁpi vanidam̐ jegŏni maḽḽi vachchĕ nayodhyagunu (||idaḍe||) saumitriyu bharadum̐ḍu śhatrughnum̐ḍum̐ gŏluvam̐ga bhūmi yelĕ kuśhalava putralam̐ gāṁchĕ śhrī maṁtum̐ḍai nilisĕ śhrī veṁkaḍādrimīm̐da kāmiṁchi vibhīṣhaṇa laṁkagum̐ baṭṭamu gaṭṭĕ