Title (Indic)ఇతఁడే నావాఁడైతే నెవ్వరికీ లోఁగనేల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతఁడే నావాఁడైతే నెవ్వరికీ లోఁగనేల కతగా యీ వుపాయము గంటినే వోచెలియా (॥ఇతఁ॥) చిలుకలు పలుకనీ చేరి కోవిల గూయనీ చెలువుఁ డాడినమాట చెప్పఁగదవే కలువలు మెరయనీ కమలాలు చెలఁగనీ తలఁపు దెలిసితివా తగిలి నీవతని (॥ఇతఁ॥) చందురుఁడు రానీవే చల్లగా లేతేరనీవే యిందుకు వచ్చెనా తాను యెఱిఁగించవే ఇందిందిరాలు రేఁగనీ యిగిరించనీ తీగెలు కందువ నాపై బత్తిగఁదా విభునికి (॥ఇతఁ॥) కప్పుర మగ్గువగానీ గందవొడెక్కుడుగానీ వొప్పుగఁ బానుపుపై నాతఁడున్నాఁడటే కప్పి వసంతకాలము గానీ మరుఁ డెసగనీ యిప్పుడు వచ్చి శ్రీవేంకటేశుఁడేలె నన్నును English(||pallavi||) idam̐ḍe nāvām̐ḍaide nĕvvarigī lom̐ganela kadagā yī vubāyamu gaṁṭine vosĕliyā (||idam̐||) silugalu paluganī seri kovila gūyanī sĕluvum̐ ḍāḍinamāḍa sĕppam̐gadave kaluvalu mĕrayanī kamalālu sĕlam̐ganī talam̐pu dĕlisidivā tagili nīvadani (||idam̐||) saṁdurum̐ḍu rānīve sallagā lederanīve yiṁdugu vachchĕnā tānu yĕṟim̐giṁchave iṁdiṁdirālu rem̐ganī yigiriṁchanī tīgĕlu kaṁduva nābai battigam̐dā vibhunigi (||idam̐||) kappura magguvagānī gaṁdavŏḍĕkkuḍugānī vŏppugam̐ bānububai nādam̐ḍunnām̐ḍaḍe kappi vasaṁtagālamu gānī marum̐ ḍĕsaganī yippuḍu vachchi śhrīveṁkaḍeśhum̐ḍelĕ nannunu