Title (Indic)ఇతఁడే బ్రహ్మస్వరూప మితఁడే పరతత్వము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతఁడే బ్రహ్మస్వరూప మితఁడే పరతత్వము యితఁడే స్వయంవక్త మిటని తలఁచుఁడీ (॥ఇతఁడే॥) హరి వేంకటాద్రి నుండు నని పురాణములు చెప్పు పరమేష్టికి విశ్వరూపము చూపినందుకు సరుసనే జనులకు స్వప్నములో మాటలాడి పరుషలకు పరాలు పై పై నిచ్చీని (॥ఇతఁడే॥) మునులు పూజించి రట మున్నే యీ మూర్తిని సనకాదియోగీంద్రు లిచ్చటనే వెదకిరటా యెనలేని మహిమలు యెప్పుడునుఁ గలవట ఘనదివ్య జ్ఞానసిద్దిగలవాఁడట (॥ఇతఁడే॥) అలమేల్మంగ వురమందుఁ గాఁపుర మున్నది యిల శ్రీవేంకటేశుఁ డితఁడై వున్నాఁడు తలఁప నితనిపేరే ధరించిరి లోకు లెల్లా తెలుసుకొంటేఁ దానే దృష్టదేవుఁడు English(||pallavi||) idam̐ḍe brahmasvarūba midam̐ḍe paradatvamu yidam̐ḍe svayaṁvakta miḍani talam̐sum̐ḍī (||idam̐ḍe||) hari veṁkaḍādri nuṁḍu nani purāṇamulu sĕppu parameṣhṭigi viśhvarūbamu sūbinaṁdugu sarusane janulagu svapnamulo māḍalāḍi paruṣhalagu parālu pai pai nichchīni (||idam̐ḍe||) munulu pūjiṁchi raḍa munne yī mūrdini sanagādiyogīṁdru lichchaḍane vĕdagiraḍā yĕnaleni mahimalu yĕppuḍunum̐ galavaḍa ghanadivya jñānasiddigalavām̐ḍaḍa (||idam̐ḍe||) alamelmaṁga vuramaṁdum̐ gām̐pura munnadi yila śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍai vunnām̐ḍu talam̐pa nidanibere dhariṁchiri logu lĕllā tĕlusugŏṁṭem̐ dāne dṛṣhṭadevum̐ḍu