Title (Indic)ఇచ్చగించుకొంట గాక యింపులే కలిగితేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చగించుకొంట గాక యింపులే కలిగితేను అచ్చలానఁ బెనఁగితే నది జాణతనమా (॥ఇచ్చ॥) తగులనాడినప్పుడు తమకించి నప్పుడును జగడాలకుఁ బెనఁగ జాణతనమా నగఁ దలఁచి నప్పుడు నాఁటఁ జూచినప్పుడును అగడుసేయఁ బూనితే నది జాణతనమా (॥ఇచ్చ॥) కూరిమి చల్లినప్పుడు కొంగు వట్టినప్పుడును సారె నూరకె వుండేది జాణతనమా మేర మీరినప్పుడును మిక్కిలి లోనైన ప్పుడు ఆరీతి మాటలాడే దది జాణతనమా (॥ఇచ్చ॥) కందువ లంటినప్పుడు కాఁగిలించి నప్పుడును చందము సేసుకోకున్న జాణతనమా యిందులోనె శ్రీవెంకటేశుఁడు ని న్నిదెకూడె అందుకేలె వెరగందే వది జాణతనమా English(||pallavi||) ichchagiṁchugŏṁṭa gāga yiṁpule kaligidenu achchalānam̐ bĕnam̐gide nadi jāṇadanamā (||ichcha||) tagulanāḍinappuḍu tamagiṁchi nappuḍunu jagaḍālagum̐ bĕnam̐ga jāṇadanamā nagam̐ dalam̐si nappuḍu nām̐ṭam̐ jūsinappuḍunu agaḍuseyam̐ būnide nadi jāṇadanamā (||ichcha||) kūrimi sallinappuḍu kŏṁgu vaṭṭinappuḍunu sārĕ nūragĕ vuṁḍedi jāṇadanamā mera mīrinappuḍunu mikkili lonaina ppuḍu ārīdi māḍalāḍe dadi jāṇadanamā (||ichcha||) kaṁduva laṁṭinappuḍu kām̐giliṁchi nappuḍunu saṁdamu sesugogunna jāṇadanamā yiṁdulonĕ śhrīvĕṁkaḍeśhum̐ḍu ni nnidĕgūḍĕ aṁdugelĕ vĕragaṁde vadi jāṇadanamā