Title (Indic)ఇచ్చగించి నవ్వు నవ్వేవేమనేవయ్యా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చగించి నవ్వు నవ్వేవేమనేవయ్యా యెచ్చుకుందు లేదు మీలో నిఁక నానతీవయ్యా (॥ఇచ్చ॥) యిందుముఖి నీకు మొక్కి యిచ్చెనిదివో కానికె అందుకు నీవేమనేవు ఆనతీవయ్యా చెంది నీతో సిగ్గువడి చేరువ నిలుచున్నది యెందాఁకా వట్టిజోలి యిఁకనానతీవయ్యా (॥ఇచ్చ॥) కన్నులఁ దప్పక చూచి కంబము వట్టుకున్నది అన్నీనాయ నీతలఁపు ఆనతీవయ్యా సన్నలు మాకుఁ జేసీ సంగడికిఁ దెమ్మనుచు యెన్నరాదు తమకము యిఁకనానతీవయ్యా (॥ఇచ్చ॥) యేకశయ్యమీఁదనుండి యెడమాటలాడించీ ఆకతలవి యెట్టివో ఆనతీవయ్యా కైకొని శ్రీవేంకటేశ కాంతనిట్టెకూడితివి యేకాలముఁ బాయమని యిఁకనానతీవయ్యా English(||pallavi||) ichchagiṁchi navvu navvevemanevayyā yĕchchuguṁdu ledu mīlo nim̐ka nānadīvayyā (||ichcha||) yiṁdumukhi nīgu mŏkki yichchĕnidivo kānigĕ aṁdugu nīvemanevu ānadīvayyā sĕṁdi nīdo sigguvaḍi seruva nilusunnadi yĕṁdām̐kā vaṭṭijoli yim̐kanānadīvayyā (||ichcha||) kannulam̐ dappaga sūsi kaṁbamu vaṭṭugunnadi annīnāya nīdalam̐pu ānadīvayyā sannalu māgum̐ jesī saṁgaḍigim̐ dĕmmanusu yĕnnarādu tamagamu yim̐kanānadīvayyā (||ichcha||) yegaśhayyamīm̐danuṁḍi yĕḍamāḍalāḍiṁchī āgadalavi yĕṭṭivo ānadīvayyā kaigŏni śhrīveṁkaḍeśha kāṁtaniṭṭĕgūḍidivi yegālamum̐ bāyamani yim̐kanānadīvayyā