Title (Indic)ఎవ్వరెవ్వరి తలఁపు లెట్లున్నవో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎవ్వరెవ్వరి తలఁపు లెట్లున్నవో యివ్వల నాకుఁ దెలియ దేమనేవ(న?)య్యా (॥ఎవ్వ॥) మచ్చరము గలితేను మనసు లొక్కటిగావు కుచ్చితము గలితేనే గుణము లేదు తచ్చనలు గలితేను దైవారదు నిజము యిచ్చట నన్నుఁజెనకే వేమనేనయ్యా (॥ఎవ్వ॥) నాసివంతులు గలితే వలపు చవివుట్టదు ఆసలే పెక్కుగలితే ఆతుమారదు రేసులు గలిగితేను రేపుమాపు నలపులే యీసరి నన్నుఁ బొదిగేవే మనేవయ్యా (॥ఎవ్వ॥) బిగువు గలిగితేను బీర మెంతటాఁబోదు నగవు గలిగితేను ననువు లవును అగపడి శ్రీవేంకటాధిప నన్నేలితివి యెగసక్కేలెల్లాఁ బాసె యేమనేనయ్యా English(||pallavi||) ĕvvarĕvvari talam̐pu lĕṭlunnavo yivvala nāgum̐ dĕliya demaneva(na?)yyā (||ĕvva||) machcharamu galidenu manasu lŏkkaḍigāvu kuchchidamu galidene guṇamu ledu tachchanalu galidenu daivāradu nijamu yichchaḍa nannum̐jĕnage vemanenayyā (||ĕvva||) nāsivaṁtulu galide valabu savivuṭṭadu āsale pĕkkugalide ādumāradu resulu galigidenu rebumābu nalabule yīsari nannum̐ bŏdigeve manevayyā (||ĕvva||) biguvu galigidenu bīra mĕṁtaḍām̐bodu nagavu galigidenu nanuvu lavunu agabaḍi śhrīveṁkaḍādhiba nannelidivi yĕgasakkelĕllām̐ bāsĕ yemanenayyā