Title (Indic)ఎట్టైనాఁ గావకపోదు యే నెంత సేసినాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎట్టైనాఁ గావకపోదు యే నెంత సేసినాను యిట్టే నీకు శరణంటి నిదియే తెరఁగు (॥ఎట్టై॥) చేకొని నే మొక్కఁగాను చేతులు గోయఁగరాదు ఆకడఁ దప్పుకుఁ దగినాజ్ఞ మానరాదు కైకొని యపరాధాలే కావించితి నెన్నైనా యీకడ నీశరణంటి నిఁకనో తెరఁగు (॥ఎట్టై॥) చిక్కి దైన్యపడఁగాను చెలఁగి ఖండించరాదు చక్కఁగా నాద్రోహాలు సైరించరాదు అక్కడఁ జూచిన శరణాగతబిరుదు నీకు యిక్కడ నీశరణంటి నిఁకనో తెరఁగు (॥ఎట్టై॥) సేవసేయుచుండఁగాను జీతము మానుపరాదు యీవిధి నాన దోసితే నిందుకోరాదు దేవుఁడ నిన్నుఁ గొలిచి తెగి కర్మా లుడిగితి యీవల శ్రీవేంకటేశ ఇఁకనో తెరఁగు English(||pallavi||) ĕṭṭainām̐ gāvagabodu ye nĕṁta sesinānu yiṭṭe nīgu śharaṇaṁṭi nidiye tĕram̐gu (||ĕṭṭai||) segŏni ne mŏkkam̐gānu sedulu goyam̐garādu āgaḍam̐ dappugum̐ daginājña mānarādu kaigŏni yabarādhāle kāviṁchidi nĕnnainā yīgaḍa nīśharaṇaṁṭi nim̐kano tĕram̐gu (||ĕṭṭai||) sikki dainyabaḍam̐gānu sĕlam̐gi khaṁḍiṁcharādu sakkam̐gā nādrohālu sairiṁcharādu akkaḍam̐ jūsina śharaṇāgadabirudu nīgu yikkaḍa nīśharaṇaṁṭi nim̐kano tĕram̐gu (||ĕṭṭai||) sevaseyusuṁḍam̐gānu jīdamu mānubarādu yīvidhi nāna doside niṁdugorādu devum̐ḍa ninnum̐ gŏlisi tĕgi karmā luḍigidi yīvala śhrīveṁkaḍeśha im̐kano tĕram̐gu