Title (Indic)ఎప్పటికి విన్నపము ఇదియే సుమ్మీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎప్పటికి విన్నపము ఇదియే సుమ్మీ తప్పక నీవొడఁబాటు తరుణికి నీవు (॥ఎప్ప॥) వలపుచవులు చూపి జేకొంటి వింక తలఁపున వేరొండుఁ దలఁచుకుమీ కలసి వుందువుగాని కడదఁకా నిట్లానే చెలఁగి తియ్యనినోరఁ జేదు చవిగాదు (॥ఎప్ప॥) యిందరు నెఱఁగఁ జెలి నింతగా మన్నంచితివి కందులేనిచనవిచ్చి కరుణించుమీ చందమున నాకెమాఁట జవదాటకుండవయ్య విందువెట్టీఁ బగ వద్దు వేడుకయ్యా నిఁకను (॥ఎప్పు॥) వూరకుండినరమణి నొక్క టొక్కటె చేసి చేరి కూడితివి రతిఁ జెలగించుమీ యీరీతి శ్రీవేంకటేశ యీబంగారుకొండ గారబానఁ జేపట్టి కడమేల నీకు English(||pallavi||) ĕppaḍigi vinnabamu idiye summī tappaga nīvŏḍam̐bāḍu taruṇigi nīvu (||ĕppa||) valabusavulu sūbi jegŏṁṭi viṁka talam̐puna verŏṁḍum̐ dalam̐sugumī kalasi vuṁduvugāni kaḍadam̐kā niṭlāne sĕlam̐gi tiyyaninoram̐ jedu savigādu (||ĕppa||) yiṁdaru nĕṟam̐gam̐ jĕli niṁtagā mannaṁchidivi kaṁdulenisanavichchi karuṇiṁchumī saṁdamuna nāgĕmām̐ṭa javadāḍaguṁḍavayya viṁduvĕṭṭīm̐ baga vaddu veḍugayyā nim̐kanu (||ĕppu||) vūraguṁḍinaramaṇi nŏkka ṭŏkkaḍĕ sesi seri kūḍidivi radim̐ jĕlagiṁchumī yīrīdi śhrīveṁkaḍeśha yībaṁgārugŏṁḍa gārabānam̐ jebaṭṭi kaḍamela nīgu