Title (Indic)ఎన్నిటి కిఁకఁ దా నెడరయినచో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎన్నిటి కిఁకఁ దా నెడరయినచో కన్నియ నింతటఁ గావఁగవలదా (॥ఎన్ని॥) కలువ వాఁడియట ఘనచందురుఁడట యెలమిఁ జెలినిట్ల నేఁచేదా బలుచుట్టముగలఫలము విరహదెస కలసిమెలసి యిటు కావఁగవలదా (॥ఎన్ని॥) చందనగందెట చలువగాలియట యిందునె చెలి నలయించేదా అందపుచుట్టఁ బైనఫల మిపుడు కందువ నిట్టె కాచుట యరుదా (॥ఎన్ని॥) అతిశయిలకుచయట శ్రీవేంకట - పతియట కాఁగిట భ్రమసేదా చతురత నిరువురసరసవువేళల అతిశయసంఘము లలరుటగాక English(||pallavi||) ĕnniḍi kim̐kam̐ dā nĕḍarayinaso kanniya niṁtaḍam̐ gāvam̐gavaladā (||ĕnni||) kaluva vām̐ḍiyaḍa ghanasaṁdurum̐ḍaḍa yĕlamim̐ jĕliniṭla nem̐sedā balusuṭṭamugalaphalamu virahadĕsa kalasimĕlasi yiḍu kāvam̐gavaladā (||ĕnni||) saṁdanagaṁdĕḍa saluvagāliyaḍa yiṁdunĕ sĕli nalayiṁchedā aṁdabusuṭṭam̐ bainaphala mibuḍu kaṁduva niṭṭĕ kāsuḍa yarudā (||ĕnni||) adiśhayilagusayaḍa śhrīveṁkaḍa - padiyaḍa kām̐giḍa bhramasedā sadurada niruvurasarasavuveḽala adiśhayasaṁghamu lalaruḍagāga