Title (Indic)ఏఁటికి చెక్కు నొక్కేవు యింకా నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏఁటికి చెక్కు నొక్కేవు యింకా నీవు మాఁటికి మాఁటికి నీకు మంచిదాననా (॥ఏఁటి॥) తీపుల మోవులనే తేనెలు గారఁగ నాపె మాపుదాఁకా నీతోను మాఁటలాడీని కోపము రేఁగి నేనైతే గొణఁగి తిట్టితి నిన్ను మా పొందే సేసే వప్పటి మంచిదాననా (॥ఏఁటి॥) సోఁగలకన్నులనే సోద్యాలు సేసి చేసి తీగెలుసాగఁగా నాపె తేరి చూచీని ఆగడములు సేసి నిన్ను అదరించితి రెప్పల మాగురుతులే మెచ్చేవు మంచిదాననా (॥ఏఁటి॥) చిగురుఁ జేతుల నాపె శ్రీ వేంకటేశ్వర నిన్ను తగిలి కాఁగిటఁ గూడె తమకానను వొగరుఁగుచములను వొత్తి నే నిన్నుఁగూడితి మగటిమినే నీక మంచిదాననా English(||pallavi||) em̐ṭigi sĕkku nŏkkevu yiṁkā nīvu mām̐ṭigi mām̐ṭigi nīgu maṁchidānanā (||em̐ṭi||) tībula movulane tenĕlu gāram̐ga nābĕ mābudām̐kā nīdonu mām̐ṭalāḍīni kobamu rem̐gi nenaide gŏṇam̐gi tiṭṭidi ninnu mā pŏṁde sese vappaḍi maṁchidānanā (||em̐ṭi||) som̐galagannulane sodyālu sesi sesi tīgĕlusāgam̐gā nābĕ teri sūsīni āgaḍamulu sesi ninnu adariṁchidi rĕppala māgurudule mĕchchevu maṁchidānanā (||em̐ṭi||) sigurum̐ jedula nābĕ śhrī veṁkaḍeśhvara ninnu tagili kām̐giḍam̐ gūḍĕ tamagānanu vŏgarum̐gusamulanu vŏtti ne ninnum̐gūḍidi magaḍimine nīga maṁchidānanā