Title (Indic)ఎంత గబ్బితనమే నీకింతటిలోనే । తొల్లె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎంత గబ్బితనమే నీకింతటిలోనే । తొల్లె యింత నీ కుపదేశ మిచ్చినదె కదరా (॥ఎంత॥) పడఁతి నాపేరు నీవు పాదమున వ్రాతురటె అడియాలముగ నింతె అందుకేమిరా వొడికములైతే నీవురమున వాయరాదా యెడ చాల దందుఁ గుచా లిమ్ముకొనెఁగదరా (॥ఎంత॥) నీలపు బెండెములోన వీడ భావింతురటే తాలిమి నా ప్రియమింతె దానికేమిరా అలాగైతే నాయద్దపు జెక్కులు గావా చాలుకొన్నకళ లందే సందుకొనీఁగదరా (॥ఎంత॥) కూరిమి నాచెక్కు కొనగోర నంటుదురటే ఆరసి కూడితివి నన్నందుకేమిరా యీరీతి శ్రీవేంకటేశుడ నేఁ గాదా తేరకొన విన్నియు నీ తేకువ గా దటరా English(||pallavi||) ĕṁta gabbidaname nīgiṁtaḍilone | tŏllĕ yiṁta nī kubadeśha michchinadĕ kadarā (||ĕṁta||) paḍam̐ti nāberu nīvu pādamuna vrāduraḍĕ aḍiyālamuga niṁtĕ aṁdugemirā vŏḍigamulaide nīvuramuna vāyarādā yĕḍa sāla daṁdum̐ gusā limmugŏnĕm̐gadarā (||ĕṁta||) nīlabu bĕṁḍĕmulona vīḍa bhāviṁturaḍe tālimi nā priyamiṁtĕ dānigemirā alāgaide nāyaddabu jĕkkulu gāvā sālugŏnnagaḽa laṁde saṁdugŏnīm̐gadarā (||ĕṁta||) kūrimi nāsĕkku kŏnagora naṁṭuduraḍe ārasi kūḍidivi nannaṁdugemirā yīrīdi śhrīveṁkaḍeśhuḍa nem̐ gādā teragŏna vinniyu nī teguva gā daḍarā