Title (Indic)ఏఁపుచు నా కాళ్లితఁడేల పట్టేనె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏఁపుచు నా కాళ్లితఁడేల పట్టేనె రాఁపు సేసి నాకుఁ బెద్దమోఁపు గట్టినట్లు (॥ఏఁపుచు॥) తలమాసి కోకమాసి తాపమున నుండంగాను యెలయించి యితఁడు నన్నేల యేఁచీనే మలినమై దేహమెల్ల మఱిచినఁ దలఁపించి వులికి కాలఁగఁ గొఱవులఁజూఁడినట్లు (॥ఏఁపుచు॥) కూడుఁబాసి నీటిఁబాసి కొరమాలి వుండఁగాను యేడనుండో వచ్చి యీతఁ డేల పోరీనే వేడుక లన్నియు మాని వేదనల నుండఁగాను కాఁడినపోట్లలోన కత్తిఁగోసినట్లు (॥ఏఁపుచు॥) తల్లిఁబాసి యిల్లువాసి తరిలేక వుండఁగాను యెల్లగా కౌఁగిట నితఁ డేల నొక్కీనే చెల్లునంటా నన్ను గూడి శ్రీ వేంకటేశుండు ముల్లు ముంటనే తీసి మోసపుచ్చినట్లు English(||pallavi||) em̐pusu nā kāḽlidam̐ḍela paṭṭenĕ rām̐pu sesi nāgum̐ bĕddamom̐pu gaṭṭinaṭlu (||em̐pusu||) talamāsi kogamāsi tābamuna nuṁḍaṁgānu yĕlayiṁchi yidam̐ḍu nannela yem̐sīne malinamai dehamĕlla maṟisinam̐ dalam̐piṁchi vuligi kālam̐gam̐ gŏṟavulam̐jūm̐ḍinaṭlu (||em̐pusu||) kūḍum̐bāsi nīḍim̐bāsi kŏramāli vuṁḍam̐gānu yeḍanuṁḍo vachchi yīdam̐ ḍela porīne veḍuga lanniyu māni vedanala nuṁḍam̐gānu kām̐ḍinaboṭlalona kattim̐gosinaṭlu (||em̐pusu||) tallim̐bāsi yilluvāsi tarilega vuṁḍam̐gānu yĕllagā kaum̐giḍa nidam̐ ḍela nŏkkīne sĕllunaṁṭā nannu gūḍi śhrī veṁkaḍeśhuṁḍu mullu muṁṭane tīsi mosabuchchinaṭlu