Title (Indic)ఏమిచెప్పేవే మాతో నింపులైన నీ సుద్దులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమిచెప్పేవే మాతో నింపులైన నీ సుద్దులు ప్రేమము గలవారికి పెనఁగులా టరుదా (॥॥) నవ్వుతా మాటలాడేవు నయగారాలే సేసేవు యివ్వల నీకతఁడు మోహించు టరుదా వువ్విళ్లూర నేపొద్దు నొద్దనే కాచుకుండేవు నివ్వటిల్ల చనవులు నీకు నిచ్చుటరుదా (॥॥) తేలించి చూచేవు తేనేలమోవి చూపేవు కోలుముందై పతి మరుగుట యరుదా తాలిమితో సన్నలనే తరితీపులే చల్లేవు వాలాయించి నీకతఁడు వసమవు టరుదా (॥॥) ఇచ్చకములే సేసేవు యిన్నిటా మెప్పించేవు కొచ్చి శ్రీవేంకటేశుఁడు గూడుటరుదా నిచ్చలు నన్నేలించేవు నీ వలమేలుమంగవు యిచ్చట నీకితఁ డిట్టె యిరవౌటరుదా English(||pallavi||) emisĕppeve mādo niṁpulaina nī suddulu premamu galavārigi pĕnam̐gulā ṭarudā (||||) navvudā māḍalāḍevu nayagārāle sesevu yivvala nīgadam̐ḍu mohiṁchu ṭarudā vuvviḽlūra nebŏddu nŏddane kāsuguṁḍevu nivvaḍilla sanavulu nīgu nichchuḍarudā (||||) teliṁchi sūsevu tenelamovi sūbevu kolumuṁdai padi maruguḍa yarudā tālimido sannalane taridībule sallevu vālāyiṁchi nīgadam̐ḍu vasamavu ṭarudā (||||) ichchagamule sesevu yinniḍā mĕppiṁchevu kŏchchi śhrīveṁkaḍeśhum̐ḍu gūḍuḍarudā nichchalu nanneliṁchevu nī valamelumaṁgavu yichchaḍa nīgidam̐ ḍiṭṭĕ yiravauḍarudā