Title (Indic)ఏమిటి కాసపడేవు యెందుకైనాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమిటి కాసపడేవు యెందుకైనాను సాము సేసినట్టి నీతో సాటి వచ్చేమా (॥ఏమి॥) తచ్చి చూడ నీకునిది దట్టిగట్టు నౌనేమో పచ్చనాకు మాకొంగు పట్టేవు నీవు యిచ్చ మాకాకిపైఁడిబొట్టేమి చూచేవింతలోనే బచ్చెన నీపైఁడిచీర పాటిదయ్యీనా (॥ఏమి॥) యెంచుకో నీ సొమ్ములలో యిది దాఁచవచ్చునేమో పంచెపు మాగురిగింజపేరడిగేవు దించనట్టి మావింటిదిక్కేమి చూచేవు సంచపు నీ చుట్టుఁగత్తి సరివచ్చీనా (॥ఏమి॥) యిప్పుడే తెలుసుకో నీకిది గూడయ్యీనేమో నెప్పున మామోవితేనె నీవు గోరేవు ముప్పిరి శ్రీ వెంకటేశ ముంచి నన్నుఁ గూడితివి యెప్పుడూనురముకాంత కెనవచ్చీ నా English(||pallavi||) emiḍi kāsabaḍevu yĕṁdugainānu sāmu sesinaṭṭi nīdo sāḍi vachchemā (||emi||) tachchi sūḍa nīgunidi daṭṭigaṭṭu naunemo pachchanāgu māgŏṁgu paṭṭevu nīvu yichcha māgāgibaim̐ḍibŏṭṭemi sūseviṁtalone bachchĕna nībaim̐ḍisīra pāḍidayyīnā (||emi||) yĕṁchugo nī sŏmmulalo yidi dām̐savachchunemo paṁchĕbu māgurigiṁjaberaḍigevu diṁchanaṭṭi māviṁṭidikkemi sūsevu saṁchabu nī suṭṭum̐gatti sarivachchīnā (||emi||) yippuḍe tĕlusugo nīgidi gūḍayyīnemo nĕppuna māmovidenĕ nīvu gorevu muppiri śhrī vĕṁkaḍeśha muṁchi nannum̐ gūḍidivi yĕppuḍūnuramugāṁta kĕnavachchī nā