Title (Indic)ఏమి సేయుదును నే నేమి సేయుదును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమి సేయుదును నే నేమి సేయుదును స్వామిద్రోహమె జరగీని (॥ఏమి॥) నీ యాధీనమై నెగడిన యాత్మకు నీ యందె బుద్ది నిలువదు కాయపుటింద్రియ కల్పిత దేహము కాయపు విషయాలె కడుఁ గోరీని (॥ఏమి॥) నీ సంకల్పమున నెగడిన జగ మిది నీ సేవారతి నేరదు ఆసల నీ మాయ నంటిన మన సిది ఆసలాసలనే అలసీని (॥ఏమి॥) హరి నీవే నాలోన నణచిన జ్ఞానము హరి నీవె చూపక అందదూ సిరుల నా పాలిటి శ్రీ వేంకటేశ్వర కరుణానిధి నన్నుఁ గావవే English(||pallavi||) emi seyudunu ne nemi seyudunu svāmidrohamĕ jaragīni (||emi||) nī yādhīnamai nĕgaḍina yātmagu nī yaṁdĕ buddi niluvadu kāyabuḍiṁdriya kalbida dehamu kāyabu viṣhayālĕ kaḍum̐ gorīni (||emi||) nī saṁkalbamuna nĕgaḍina jaga midi nī sevāradi neradu āsala nī māya naṁṭina mana sidi āsalāsalane alasīni (||emi||) hari nīve nālona naṇasina jñānamu hari nīvĕ sūbaga aṁdadū sirula nā pāliḍi śhrī veṁkaḍeśhvara karuṇānidhi nannum̐ gāvave