Title (Indic)ఏమయ్యా వూరక చూచే వెత్తి కాఁగిలించుకోక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమయ్యా వూరక చూచే వెత్తి కాఁగిలించుకోక ఆముకొన్న యాసోదాన నలయుచునున్నది (॥ఏమ॥) చిత్తము నీపైఁ బెట్టి సిగ్గుతోఁ దాఁ దలవంచి హత్తి వూడిగలు సేసీ నదివో చెలి బత్తినీపైఁ బెట్టుకొని పాదాలు వాసుకుంటా కొత్తవలపులతోడ గుబ్బతిలీని (॥ఏమ॥) పాయము నీ కప్పగించి పాపట దువ్వుకొంటా పాయక కొలువులోన భావించీఁ జెలి దోయఁడుచేతుల మొక్కి తఁగుఁజెమటలతోడ సోయగపుఁ జూపులఁ జూచి చొక్కీని (॥ఏమ॥) తాళి నీకుఁగాఁ గట్టి తనలోనే గుట్టుతోడ తాలిమితమకమున దైవారీఁ జెలి యీలీల శ్రీవేంకటేశ ఇంతలో నీవు గూడఁగ మేలిమి సంతోసాన మించి చెలఁగీని English(||pallavi||) emayyā vūraga sūse vĕtti kām̐giliṁchugoga āmugŏnna yāsodāna nalayusununnadi (||ema||) sittamu nībaim̐ bĕṭṭi siggudom̐ dām̐ dalavaṁchi hatti vūḍigalu sesī nadivo sĕli battinībaim̐ bĕṭṭugŏni pādālu vāsuguṁṭā kŏttavalabuladoḍa gubbadilīni (||ema||) pāyamu nī kappagiṁchi pābaḍa duvvugŏṁṭā pāyaga kŏluvulona bhāviṁchīm̐ jĕli doyam̐ḍusedula mŏkki tam̐gum̐jĕmaḍaladoḍa soyagabum̐ jūbulam̐ jūsi sŏkkīni (||ema||) tāḽi nīgum̐gām̐ gaṭṭi tanalone guṭṭudoḍa tālimidamagamuna daivārīm̐ jĕli yīlīla śhrīveṁkaḍeśha iṁtalo nīvu gūḍam̐ga melimi saṁtosāna miṁchi sĕlam̐gīni