Title (Indic)ఏమయ్యా నా సేవ లెస్స యీడేరెనా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమయ్యా నా సేవ లెస్స యీడేరెనా ఆముకొన్న నీ తలఁపు లానతియ్యవయ్యా (॥ఏమ॥) నిద్దిరించవలె నంటా నేఁ బాదము లొత్తితే సుద్దు లేమి యడిగేవు సొరిది నీవు వొద్దిక నల పారఁగ నెయ్య నే విసరితే కొద్దిమీఱఁ జెమటలు కురిసేవు నీవు (॥ఏమయ్య॥) యెత్తుగా బటువుబిల్ల లిరువంకలాఁ బెట్టితే హత్తి చన్ను లంటె వప్పటి నీవు బత్తితోఁ బచ్చడము నీపై నిండాఁ గప్పితే మొత్తమి నేల నవ్వేవు ముసుఁగులో నీవు (॥ఏమయ్య॥) చేరి రంతు సేయకుండా చెలుల రానీకుండితే ఆరయఁ గౌఁగిలించేవు అంతలో నీవు యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే కోరికె లింపొందెఁ దొల్లే కూడవద్దా నీవు English(||pallavi||) emayyā nā seva lĕssa yīḍerĕnā āmugŏnna nī talam̐pu lānadiyyavayyā (||ema||) niddiriṁchavalĕ naṁṭā nem̐ bādamu lŏttide suddu lemi yaḍigevu sŏridi nīvu vŏddiga nala pāram̐ga nĕyya ne visaride kŏddimīṟam̐ jĕmaḍalu kurisevu nīvu (||emayya||) yĕttugā baḍuvubilla liruvaṁkalām̐ bĕṭṭide hatti sannu laṁṭĕ vappaḍi nīvu battidom̐ bachchaḍamu nībai niṁḍām̐ gappide mŏttami nela navvevu musum̐gulo nīvu (||emayya||) seri raṁtu seyaguṁḍā sĕlula rānīguṁḍide ārayam̐ gaum̐giliṁchevu aṁtalo nīvu yīrīdi śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭe korigĕ liṁpŏṁdĕm̐ dŏlle kūḍavaddā nīvu