Title (Indic)ఏమని విన్నవించేము ఇన్నియు నీ చిత్తమే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమని విన్నవించేము ఇన్నియు నీ చిత్తమే నీ మతకమంతయును నెరవేరెఁగా (॥ఏమని॥) గోవిందుఁడవైతివి గోపాలుఁడవైతివి వావులెంచ కిందరిని వలపింతురా పూవుల వేసినవారు పప్పొడి చల్లినవారు వోవరిలోపల నీకు వొక్కసరేకా (॥ఏమని॥) రాచవాఁడవై తేనేమి రచ్చగొల్లవైతే నేమి చూచి పాలు వెన్నలు ముచ్చులు కొందురా కాచుక వుండినవారు గక్కన వచ్చినవారు చేచేత సేస వెట్టితే చెలఁగి సరే కా (॥ఏమని॥) మంచిదేవుఁడవు గా మానిసి రూపైనాఁ గా కొంచక సతుల నెత్తుకొని వత్తురా పొంచి శ్రీ వేంకటేశ్వర పొరుగువా రిరుగువాఁ రెంచ నీకు మంచముపైనిందరు సరేకా English(||pallavi||) emani vinnaviṁchemu inniyu nī sittame nī madagamaṁtayunu nĕraverĕm̐gā (||emani||) goviṁdum̐ḍavaidivi gobālum̐ḍavaidivi vāvulĕṁcha kiṁdarini valabiṁturā pūvula vesinavāru pappŏḍi sallinavāru vovarilobala nīgu vŏkkasaregā (||emani||) rāsavām̐ḍavai tenemi rachchagŏllavaide nemi sūsi pālu vĕnnalu muchchulu kŏṁdurā kāsuga vuṁḍinavāru gakkana vachchinavāru seseda sesa vĕṭṭide sĕlam̐gi sare kā (||emani||) maṁchidevum̐ḍavu gā mānisi rūbainām̐ gā kŏṁchaga sadula nĕttugŏni vatturā pŏṁchi śhrī veṁkaḍeśhvara pŏruguvā riruguvām̐ rĕṁcha nīgu maṁchamubainiṁdaru saregā