Title (Indic)ఏల నన్ను సోదించె వెందాఁకాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏల నన్ను సోదించె వెందాఁకాను నీ లాగులు నా లాగులు నీకే తెలుసును (॥ఏల॥) తక్కించి నీవు నన్నుఁ దప్పులువట్టేవు గాక యెక్కువనామనసు నీవెఱఁగనిదా చెక్కు చేతఁబట్టుకొని సిగ్గువడి వున్నదాన నిక్కి నావిన్నపాలెల్లా నీకే తెలుసును (॥ఏల॥) మంతనాన నాతోను మాఁటలు దీసేవుగాక యింతట నాగుణము నీవెఱఁగనిదా బంతి నిందరిలో మానాపతినై నేనున్నదాన దొంతునాయాస నీకు తొల్లే తెలుసును (॥ఏల॥) నవ్వుతానే నీవు నన్ను నంటునఁ గూడితిగాక యివ్వల నానేరువు నీవెఱఁగనిదా జవ్వనపు శ్రీవేంకటేశ్వర యలమేల్ మంగను పువ్వువంటిపొందు నీకుఁ బూఁచితేఁ దెలుసును English(||pallavi||) ela nannu sodiṁchĕ vĕṁdām̐kānu nī lāgulu nā lāgulu nīge tĕlusunu (||ela||) takkiṁchi nīvu nannum̐ dappuluvaṭṭevu gāga yĕkkuvanāmanasu nīvĕṟam̐ganidā sĕkku sedam̐baṭṭugŏni sigguvaḍi vunnadāna nikki nāvinnabālĕllā nīge tĕlusunu (||ela||) maṁtanāna nādonu mām̐ṭalu dīsevugāga yiṁtaḍa nāguṇamu nīvĕṟam̐ganidā baṁti niṁdarilo mānābadinai nenunnadāna dŏṁtunāyāsa nīgu tŏlle tĕlusunu (||ela||) navvudāne nīvu nannu naṁṭunam̐ gūḍidigāga yivvala nāneruvu nīvĕṟam̐ganidā javvanabu śhrīveṁkaḍeśhvara yalamel maṁganu puvvuvaṁṭibŏṁdu nīgum̐ būm̐sidem̐ dĕlusunu