Title (Indic)ఎక్కడౌతా నెఱఁగదు యెంత వలచెనో కాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎక్కడౌతా నెఱఁగదు యెంత వలచెనో కాని చిక్కువడ్డవేళ బుద్ది చెప్పరె చెలులు (॥॥) కోరి మాఁటలాడీఁ గాని కొప్పు వీడు టెఱఁగదు ఆరయ విభునితోడ నయ్యా చెలి పారితెంచీఁ జనుఁగొంగు బయలౌతా నెఱఁగదు గారవించిమీరైనాఁ గప్పరే చెలులు (॥॥) తప్పక చూచీఁగాని తన్నుఁదానె యెఱఁగదు అప్పుడే మోహము నాఁటీ నయ్యో చెలి చిప్పిలఁ బైనొరగీని చెమరించు టెఱఁగదు దప్పిదేర విసరరే దగ్గరైనఁ జెఁలులు (॥॥) కాఁగిలించకొనీఁగాని కళదాఁకు టెఱఁగదు అఁగి తనివిదీరక అయ్యో చెలి వీఁగక కడపలోన శ్రీ వేంకటేశుఁగూడి చెలి చేఁగదేర నవ్వీ సన్న సేయరే చెలులు English(||pallavi||) ĕkkaḍaudā nĕṟam̐gadu yĕṁta valasĕno kāni sikkuvaḍḍaveḽa buddi sĕpparĕ sĕlulu (||||) kori mām̐ṭalāḍīm̐ gāni kŏppu vīḍu ṭĕṟam̐gadu āraya vibhunidoḍa nayyā sĕli pāridĕṁchīm̐ janum̐gŏṁgu bayalaudā nĕṟam̐gadu gāraviṁchimīrainām̐ gappare sĕlulu (||||) tappaga sūsīm̐gāni tannum̐dānĕ yĕṟam̐gadu appuḍe mohamu nām̐ṭī nayyo sĕli sippilam̐ bainŏragīni sĕmariṁchu ṭĕṟam̐gadu dappidera visarare daggarainam̐ jĕm̐lulu (||||) kām̐giliṁchagŏnīm̐gāni kaḽadām̐ku ṭĕṟam̐gadu am̐gi tanividīraga ayyo sĕli vīm̐gaga kaḍabalona śhrī veṁkaḍeśhum̐gūḍi sĕli sem̐gadera navvī sanna seyare sĕlulu