Title (Indic)ఎగసక్కే లాడనేర యిచ్చకము లాడనోప WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎగసక్కే లాడనేర యిచ్చకము లాడనోప జగడాలు మాని యింక చక్కనుండుమనవే (॥॥) చెలిమిసేసేవాఁడైతే చేఁతకల్లా లోనౌఁగాక మలకలమలకలమాట లేఁటికే వలపెల్లా నాసొమ్ము వట్టిసట దనసొమ్ము చలము లింకానేల చక్కనుండుమనవే (॥॥) తప్పులేనివాఁడైతే తాలిమితో నుండుఁగాక అప్పటిని యింతేసియాన లేఁటికే యెప్పుడూ నేఁదనదాన యెవ్వరివాఁడో తాను చప్పుడు సేయక యిఁక చక్కనుండుమనవే (॥॥) సమ్మతించినవాఁడైతే చనవిచ్చి కూడుఁగాక కమ్మటి రేపుమాపని గడు వేఁటికే తమ్మిపువ్వుకాంతను తాశ్రీవేంకటేశుఁడు సమ్మదము లోనగూడె చక్కనుండుమనవే English(||pallavi||) ĕgasakke lāḍanera yichchagamu lāḍanoba jagaḍālu māni yiṁka sakkanuṁḍumanave (||||) sĕlimisesevām̐ḍaide sem̐tagallā lonaum̐gāga malagalamalagalamāḍa lem̐ṭige valabĕllā nāsŏmmu vaṭṭisaḍa danasŏmmu salamu liṁkānela sakkanuṁḍumanave (||||) tappulenivām̐ḍaide tālimido nuṁḍum̐gāga appaḍini yiṁtesiyāna lem̐ṭige yĕppuḍū nem̐danadāna yĕvvarivām̐ḍo tānu sappuḍu seyaga yim̐ka sakkanuṁḍumanave (||||) sammadiṁchinavām̐ḍaide sanavichchi kūḍum̐gāga kammaḍi rebumābani gaḍu vem̐ṭige tammibuvvugāṁtanu tāśhrīveṁkaḍeśhum̐ḍu sammadamu lonagūḍĕ sakkanuṁḍumanave