Title (Indic)ఈమాట విని నిన్ను నిందుకే నవ్వితి నేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఈమాట విని నిన్ను నిందుకే నవ్వితి నేను నేమమెంత నేమెంత నీ కరుణ యెంత (॥ఈమా॥) సకలకర్మము చేత సాధ్యముగాని నీవు వొక ఇంచుకంత భక్తి కొగి లోనైతి ప్రకటించి బహువేదపఠనఁ జిక్కని నీవు మొకరివై తిరుమంత్రమునకుఁ జిక్కితివి (॥ఈమా॥) కోటిదానములచేత కోరి లోనుగాని నీవు పాటించి శరణంటేనే పట్టి లోనైతి మేటి వుగ్రతపముల మెచ్చి కైకొనని నీవు గాటపుదాసులై తేనే కైకొని మన్నించితి (॥ఈమా॥) పెక్కుతీర్థములాడిన బేధించరాని నీవు చొక్కి నీముద్రవారికి సులభుఁడవు గక్కన దేవతలకుఁ గానరాని నీవు మాకు నిక్కడ శ్రీవేంకటాద్రి నిరవైతివి English(||pallavi||) īmāḍa vini ninnu niṁduge navvidi nenu nemamĕṁta nemĕṁta nī karuṇa yĕṁta (||īmā||) sagalagarmamu seda sādhyamugāni nīvu vŏga iṁchugaṁta bhakti kŏgi lonaidi pragaḍiṁchi bahuvedabaṭhanam̐ jikkani nīvu mŏgarivai tirumaṁtramunagum̐ jikkidivi (||īmā||) koḍidānamulaseda kori lonugāni nīvu pāḍiṁchi śharaṇaṁṭene paṭṭi lonaidi meḍi vugradabamula mĕchchi kaigŏnani nīvu gāḍabudāsulai tene kaigŏni manniṁchidi (||īmā||) pĕkkudīrdhamulāḍina bedhiṁcharāni nīvu sŏkki nīmudravārigi sulabhum̐ḍavu gakkana devadalagum̐ gānarāni nīvu māgu nikkaḍa śhrīveṁkaḍādri niravaidivi