Title (Indic)ఈతఁడే యీతఁడే సుండి యెంత యెంచిచూచినా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఈతఁడే యీతఁడే సుండి యెంత యెంచిచూచినా చేతనే వరాలిచ్చీ శేషాచలేశుఁడు (॥ఈతఁ॥) విశ్వరూపబ్రహ్మము విరాట్టయిన బ్రహ్మము ఐశ్వర్యస్వరా ట్టాసామ్రాట్టయిన బ్రహ్మము శాశ్వతబ్రహ్మాండాలు శరీరమైన బ్రహ్మము యీశ్వరుఁడై మహరాట్టై యిందరిలో బ్రహ్మము (॥ఈతఁ॥) సూర్యునిలో తేజము సోమునిలో తేజము శౌర్యపు టనలుని భాస్వత్తేజము కార్యపు టవతారాలఁ గనుఁగొనే తేజము వీర్యపుటెజ్ఞభాగాల విష్ణునామ తేజము (॥ఈతఁ॥) పరమపురుషమూర్తి ప్రకృతియైన మూర్తి గరిమతో మహదహంకార మూరితి ధరఁ బంచతన్మాత్రలు తత్త్వములైన మూరితి గరుడానంత సేనేశకర్తయైన మూరితి (॥ఈతఁ॥) భాగవతపు దైవము భారతములో దైవము సాగిన పురాణవేదశాస్త్ర దైవము పోగులైన బ్రహ్మలను బొడ్డునఁ గన్న దైవము శ్రీగలిగి భూపతైన శ్రీవేంకటదైవము English(||pallavi||) īdam̐ḍe yīdam̐ḍe suṁḍi yĕṁta yĕṁchisūsinā sedane varālichchī śheṣhāsaleśhum̐ḍu (||īdam̐||) viśhvarūbabrahmamu virāṭṭayina brahmamu aiśhvaryasvarā ṭṭāsāmrāṭṭayina brahmamu śhāśhvadabrahmāṁḍālu śharīramaina brahmamu yīśhvarum̐ḍai maharāṭṭai yiṁdarilo brahmamu (||īdam̐||) sūryunilo tejamu somunilo tejamu śhauryabu ṭanaluni bhāsvattejamu kāryabu ṭavadārālam̐ ganum̐gŏne tejamu vīryabuḍĕjñabhāgāla viṣhṇunāma tejamu (||īdam̐||) paramaburuṣhamūrdi prakṛtiyaina mūrdi garimado mahadahaṁkāra mūridi dharam̐ baṁchadanmātralu tattvamulaina mūridi garuḍānaṁta seneśhagardayaina mūridi (||īdam̐||) bhāgavadabu daivamu bhāradamulo daivamu sāgina purāṇavedaśhāstra daivamu pogulaina brahmalanu bŏḍḍunam̐ ganna daivamu śhrīgaligi bhūbadaina śhrīveṁkaḍadaivamu