Title (Indic)ఏడనుండి వచ్చితివే యీడకు నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏడనుండి వచ్చితివే యీడకు నీవు వాడిక సేసుక యేమి వద్దఁ గూచుండేవే (॥ఏడ॥) పవ్వళించియున్నవాని పాటలు వాడి లేపి యివ్వల నూరకే యెంత యెలయించేవే దివ్వెలెత్తుఁ బొద్దుకాడ తెరలోననున్నవాని రవ్వఁగా బిలిచి చదరంగా లేమాడేవే (॥ఏడ॥) ఆకడి మోమైనవాని నట్టె చెక్కునొక్కి తీసి కాకరి మాఁటల నేమి కత చెప్పేవే నాకడనుండినవాని నవ్వు నవ్వి కొనగోర రేక దీసి తమి యెంత రేఁచవచ్చేవే (॥ఏడ॥) అలసియున్నవాని నట్టె కౌఁగిలించుకొని మలసి మోవిచ్చి యెంత మరిగించేవే యెలమి శ్రీవేంకటేశుఁ డిప్పు డిట్టె నన్నుఁగూడె వలపులు రేఁచి యేమి వావులు చెప్పేవే English(||pallavi||) eḍanuṁḍi vachchidive yīḍagu nīvu vāḍiga sesuga yemi vaddam̐ gūsuṁḍeve (||eḍa||) pavvaḽiṁchiyunnavāni pāḍalu vāḍi lebi yivvala nūrage yĕṁta yĕlayiṁcheve divvĕlĕttum̐ bŏddugāḍa tĕralonanunnavāni ravvam̐gā bilisi sadaraṁgā lemāḍeve (||eḍa||) āgaḍi momainavāni naṭṭĕ sĕkkunŏkki tīsi kāgari mām̐ṭala nemi kada sĕppeve nāgaḍanuṁḍinavāni navvu navvi kŏnagora rega dīsi tami yĕṁta rem̐savachcheve (||eḍa||) alasiyunnavāni naṭṭĕ kaum̐giliṁchugŏni malasi movichchi yĕṁta marigiṁcheve yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍippu ḍiṭṭĕ nannum̐gūḍĕ valabulu rem̐si yemi vāvulu sĕppeve