Title (Indic)ఏపాటి బత్తిగలఁడో యిటు నామీఁద WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏపాటి బత్తిగలఁడో యిటు నామీఁద దాపుగా నా సుద్దులిట్టె తలపెట్టి చూడవే (॥॥) మనసు దెలియరాక మర్మము లడుగరాక వొనగూడి గుట్టుతోడ నున్నదాననే ఘనుఁ డాతఁ డన్నిటాను కాంతరో నీవై నాను అనుమానించక మాటలాడించి చూడవే (॥॥) కూరిమి గొసరరాక కొంగువట్టి తియ్యరాక వోరుచుక సిగ్గుతోడ నున్నదాననే నేరుపరి యీతఁడు నెట్టుకొని నీవైనా చేరి వద్దివారిచేతఁ జెప్పించి చూడవే (॥॥) బలిమి సేయఁగరాక పాసి వుండఁగరాక వొలిసి కాఁగిటఁ గూడివున్నదాననే యెలమి శ్రీవేంకటేశుఁ డేలె నన్ను నీవయినా సొలవక కోరికలు సోదించి చూడవే English(||pallavi||) ebāḍi battigalam̐ḍo yiḍu nāmīm̐da dābugā nā sudduliṭṭĕ talabĕṭṭi sūḍave (||||) manasu dĕliyarāga marmamu laḍugarāga vŏnagūḍi guṭṭudoḍa nunnadānane ghanum̐ ḍādam̐ ḍanniḍānu kāṁtaro nīvai nānu anumāniṁchaga māḍalāḍiṁchi sūḍave (||||) kūrimi gŏsararāga kŏṁguvaṭṭi tiyyarāga vorusuga siggudoḍa nunnadānane nerubari yīdam̐ḍu nĕṭṭugŏni nīvainā seri vaddivārisedam̐ jĕppiṁchi sūḍave (||||) balimi seyam̐garāga pāsi vuṁḍam̐garāga vŏlisi kām̐giḍam̐ gūḍivunnadānane yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannu nīvayinā sŏlavaga korigalu sodiṁchi sūḍave