Title (Indic)ఏ వుపాయము నెఱుఁగ యిదె నీకు విన్నపము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ వుపాయము నెఱుఁగ యిదె నీకు విన్నపము శ్రీవల్లభ నీవే రక్షించుకో నీ బంటను (॥ఏవు॥) కొందరు తపోమహిమఁ గోరి దొడ్డవా రవుదురు పొందఁ జదివి కొందరు పూజ్యు లౌదురు కందువ పుణ్యమున స్వర్గ మేలుదురు కొందరు ముందే నేనైతే నీ ధర్మమున నుండేవాఁడను (॥ఏవు॥) తమ యాత్మనే తలఁచి ధన్యు లౌదురు గొందరు తిమిరి దానాలు చేసి దివ్యు లౌదురు గొందరు నెమకి కాయసిద్ధిచే నిత్యు లౌదురు గొందరు ప్రమదాన నేనైతే నీ ప్రభావమువాఁడను (॥ఏవు॥) గట్టిగా సత్యమే ఆడి ఘను లౌదురు గొందరు పట్టిన వ్రతములను బ్రదుకుదురు గొందరు యిట్టె యలమేలుమంగ నేలిన శ్రీవేంకటేశ పట్టి నేనైతే నిన్నుఁ బాడేటివాఁడను English(||pallavi||) e vubāyamu nĕṟum̐ga yidĕ nīgu vinnabamu śhrīvallabha nīve rakṣhiṁchugo nī baṁṭanu (||evu||) kŏṁdaru tabomahimam̐ gori dŏḍḍavā ravuduru pŏṁdam̐ jadivi kŏṁdaru pūjyu lauduru kaṁduva puṇyamuna svarga meluduru kŏṁdaru muṁde nenaide nī dharmamuna nuṁḍevām̐ḍanu (||evu||) tama yātmane talam̐si dhanyu lauduru gŏṁdaru timiri dānālu sesi divyu lauduru gŏṁdaru nĕmagi kāyasiddhise nityu lauduru gŏṁdaru pramadāna nenaide nī prabhāvamuvām̐ḍanu (||evu||) gaṭṭigā satyame āḍi ghanu lauduru gŏṁdaru paṭṭina vradamulanu braduguduru gŏṁdaru yiṭṭĕ yalamelumaṁga nelina śhrīveṁkaḍeśha paṭṭi nenaide ninnum̐ bāḍeḍivām̐ḍanu