Title (Indic)ఏ వూరికేవూరు యెక్కడికి నెక్కడ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ వూరికేవూరు యెక్కడికి నెక్కడ నీవు మాకు నిఁకనేల నిజమైనాఁ జెప్పరా (॥ఏవూ॥) ఆద్దమరాతిరిదాఁకా నందునిందు నుండివచ్చి వద్దువోరా నీకునింత వలసినొల్లములు నిద్దుర గంటికి లేక నీకునుండ వారమా వొద్దిక చాలని వారముండినా నుండితిమి (॥ఏవూ॥) వేఁకమైన పరితాప వేదనఁ బొరలలేక కాఁక పుట్టి తిరిగేవు కన్నుగానలేక యేఁకట దీర నీకు నెందరు గలరని వోఁకల పులుసు కలువులఁ బుచ్చవలెనా (॥ఏవూ॥) అందఁగాఁడ తిరువేంకటాద్రీశ పెక్కిండ్ల- విందవై నీవొకతెపై వెచ్చఁదన మున్నాదా మందెమేళము నీతో మాటలాడితిమి గాక కందువ మన్నన చాలు కలకాల మెల్లను English(||pallavi||) e vūrigevūru yĕkkaḍigi nĕkkaḍa nīvu māgu nim̐kanela nijamainām̐ jĕpparā (||evū||) āddamarādiridām̐kā naṁduniṁdu nuṁḍivachchi vadduvorā nīguniṁta valasinŏllamulu niddura gaṁṭigi lega nīgunuṁḍa vāramā vŏddiga sālani vāramuṁḍinā nuṁḍidimi (||evū||) vem̐kamaina paridāba vedanam̐ bŏralalega kām̐ka puṭṭi tirigevu kannugānalega yem̐kaḍa dīra nīgu nĕṁdaru galarani vom̐kala pulusu kaluvulam̐ buchchavalĕnā (||evū||) aṁdam̐gām̐ḍa tiruveṁkaḍādrīśha pĕkkiṁḍla- viṁdavai nīvŏgadĕbai vĕchcham̐dana munnādā maṁdĕmeḽamu nīdo māḍalāḍidimi gāga kaṁduva mannana sālu kalagāla mĕllanu