Title (Indic)ఏ విచారములు వొద్దు యీతఁడు రక్షకుఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ విచారములు వొద్దు యీతఁడు రక్షకుఁడు శ్రీవల్లభుండె వీఁడు చేకొని కాచీని (॥ఏవి॥) పలుమారు బొడ్డునను బ్రహ్మఁ గన్నతండ్రి పేరు దలఁచిన వారికి సంతాన మిచ్చీని కలిగి పాదములను గంగవుట్టించినవాని కొలువరో యీతఁడు కోరిక లిచ్చీని (॥ఏవి॥) మొదల నెన్నికతో కాముని గన్నవానినే కదిసి పూజించరో కరుణించీని కదలక బ్రహ్మండము గర్భమున మోచిన యెదుటి హరికి మ్రొక్కు డిన్నియును నిచ్చీని (॥ఏవి॥) గరుడగంభము వద్దగల శ్రీ వేంకటపతి వరుస సేవించరో వరమిచ్చీని ఆరిది విశ్వకుటుంబియైన వీనికి మొక్కరో పరగ దామరదంపముగాఁ జేసీని English(||pallavi||) e visāramulu vŏddu yīdam̐ḍu rakṣhagum̐ḍu śhrīvallabhuṁḍĕ vīm̐ḍu segŏni kāsīni (||evi||) palumāru bŏḍḍunanu brahmam̐ gannadaṁḍri peru dalam̐sina vārigi saṁtāna michchīni kaligi pādamulanu gaṁgavuṭṭiṁchinavāni kŏluvaro yīdam̐ḍu koriga lichchīni (||evi||) mŏdala nĕnnigado kāmuni gannavānine kadisi pūjiṁcharo karuṇiṁchīni kadalaga brahmaṁḍamu garbhamuna mosina yĕduḍi harigi mrŏkku ḍinniyunu nichchīni (||evi||) garuḍagaṁbhamu vaddagala śhrī veṁkaḍabadi varusa seviṁcharo varamichchīni āridi viśhvaguḍuṁbiyaina vīnigi mŏkkaro paraga dāmaradaṁpamugām̐ jesīni