Title (Indic)ఏ తపములు నేల యేదానములు నేల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ తపములు నేల యేదానములు నేల శ్రీతరుణీపతి నిత్యసేవే జన్మఫలము (॥ఏత॥) దేహపుటింద్రియముల దేహమందే యణఁచుటే దేహముతోనే తాను దేవుఁడౌట సోహలను వెలిఁ జూచేచూపు లోను చూచుటే ఆహా దేవతలఁ దనందే తాఁ గనుట (॥ఏత॥) వెలి నిట్టూరుపుగాలి వెళ్ళకుండా నాఁగుటే కులికి తపోధనము గూడపెట్టుట తలఁపు తనందే తగ లయము సేయుట లలిఁ బాపబంధముల లయము సేయుట (॥ఏత॥) వెనక సంసారమందు విషయ విముక్తుఁడౌటే మునుపనే తా జీవన్ముక్తుఁడౌట పనివి శ్రీవేంకటేశుపదములు శరణంటే అనువైన దివ్యపదమప్పుడే తా నందుట English(||pallavi||) e tabamulu nela yedānamulu nela śhrīdaruṇībadi nityaseve janmaphalamu (||eda||) dehabuḍiṁdriyamula dehamaṁde yaṇam̐suḍe dehamudone tānu devum̐ḍauḍa sohalanu vĕlim̐ jūsesūbu lonu sūsuḍe āhā devadalam̐ danaṁde tām̐ ganuḍa (||eda||) vĕli niṭṭūrubugāli vĕḽḽaguṁḍā nām̐guḍe kuligi tabodhanamu gūḍabĕṭṭuḍa talam̐pu tanaṁde taga layamu seyuḍa lalim̐ bābabaṁdhamula layamu seyuḍa (||eda||) vĕnaga saṁsāramaṁdu viṣhaya vimuktum̐ḍauḍe munubane tā jīvanmuktum̐ḍauḍa panivi śhrīveṁkaḍeśhubadamulu śharaṇaṁṭe anuvaina divyabadamappuḍe tā naṁduḍa