Title (Indic)ఏ తపము సేసి(తి)నో యిట నన్ను లాలించి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ తపము సేసి(తి)నో యిట నన్ను లాలించి చేతికి విడెమిచ్చేవు చిన్నదాన నేను (॥ఏత॥) కుడిదిక్కు సతులెల్లాఁ గొలువు నీకుఁ జేసేరు యెడమవంక సతులు యిదె మొక్కేరు వుడివోనివేడుకతో నొడ్డోలగమై వుండి యెడయక నాతో నవ్వే వేమిబాఁతి నేను (॥ఏత॥) విన్నపాలు సేసేవారు వేళగాచుకున్నారు సన్నసేసేవారు సరుసనే వున్నారు మన్నించి యేపొద్దు నీవు మాటలు నాతో నాడేవు యేన్ని చూచితే మరి యెంతదాన నేను (॥ఏత॥) పెండిలి నిన్నాడేవారు పీఁటమీఁదనే వున్నారు నిండువావిమేనవారు నిలుచున్నారు అండనే శ్రీవేంకటేశ అలమేల్మంగపతివి మెండుగా నన్నేలితివి మేలుదాన నేను English(||pallavi||) e tabamu sesi(ti)no yiḍa nannu lāliṁchi sedigi viḍĕmichchevu sinnadāna nenu (||eda||) kuḍidikku sadulĕllām̐ gŏluvu nīgum̐ jeseru yĕḍamavaṁka sadulu yidĕ mŏkkeru vuḍivoniveḍugado nŏḍḍolagamai vuṁḍi yĕḍayaga nādo navve vemibām̐ti nenu (||eda||) vinnabālu sesevāru veḽagāsugunnāru sannasesevāru sarusane vunnāru manniṁchi yebŏddu nīvu māḍalu nādo nāḍevu yenni sūside mari yĕṁtadāna nenu (||eda||) pĕṁḍili ninnāḍevāru pīm̐ṭamīm̐dane vunnāru niṁḍuvāvimenavāru nilusunnāru aṁḍane śhrīveṁkaḍeśha alamelmaṁgabadivi mĕṁḍugā nannelidivi meludāna nenu