Title (Indic)ఏ నోరువెట్టుక నిన్ను నేమని కావుమందును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ నోరువెట్టుక నిన్ను నేమని కావుమందును నే నిన్నుఁ దలఁచినది నిమిషమూ లేదు (॥ఏనో॥) పాయమెల్ల సఁసారముపాలే పడితిఁ గాని చేయార నీసేవ నేఁ జేసుట లేదు కాయమెల్ల కాంతలకే కడుశేషమాయఁగాని నీ యవసరములందు నే నొదుగలేదు (॥ఏనో॥) చిత్తము ఆసల పాలే సేసి బదికితిఁ గాని హత్తి నిన్ను ధ్యానము సేయఁగలేదు సత్తెపు నా నాలుకెల్ల చవుల కమ్మితిఁ గాని మత్తిలి నీ కీర్తనము మరపుటా లేదు (॥ఏనో॥) పుట్టుగెల్లా నజ్ఞానముపొంతనే వుంటిఁ గాని వొట్టి నీవిజ్ఞానము నొల్లనైతిని యెట్టు నన్ను మన్నించితి విందుకే పో వెరగయ్యీ నెట్టన శ్రీవేంకటేశ నిన్నడుగా లేదు English(||pallavi||) e noruvĕṭṭuga ninnu nemani kāvumaṁdunu ne ninnum̐ dalam̐sinadi nimiṣhamū ledu (||eno||) pāyamĕlla sam̐sāramubāle paḍidim̐ gāni seyāra nīseva nem̐ jesuḍa ledu kāyamĕlla kāṁtalage kaḍuśheṣhamāyam̐gāni nī yavasaramulaṁdu ne nŏdugaledu (||eno||) sittamu āsala pāle sesi badigidim̐ gāni hatti ninnu dhyānamu seyam̐galedu sattĕbu nā nālugĕlla savula kammidim̐ gāni mattili nī kīrdanamu marabuḍā ledu (||eno||) puṭṭugĕllā najñānamubŏṁtane vuṁṭim̐ gāni vŏṭṭi nīvijñānamu nŏllanaidini yĕṭṭu nannu manniṁchidi viṁduge po vĕragayyī nĕṭṭana śhrīveṁkaḍeśha ninnaḍugā ledu