Title (Indic)ఏ నోము నోఁచితినో యింతకు మున్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ నోము నోఁచితినో యింతకు మున్ను ఆనుకొని సేవసేయ నంతదాననా (॥॥) చనవిచ్చి నీవు నాతో సరసమాడేవు గాక కనుఁగొన నేనంత చక్కని దాననా పనివడి నామీఁద పాదము చాఁచేవు గాక తనువు సోఁకుటకు నంతటి దాననా (॥॥) నాపై మన్ననఁ గూడ నవ్వులు నవ్వేవు గాక నీపొందు లిటుసేయ నేరుపరినా తీపనుచు నామోవి తేనెలడిగేవు గాక ఆపనుల కంతేసి యరుహపు దాననా (॥॥) దయఁ జూచినవాడవై తగిలి కూడేవు గాక క్రియతో నీచిత్తమెరిఁగిన దాననా నియతి శ్రీవేంకటేశ నేఁడిట్టే పెండ్లాడితివి ప్రియపడి యింతసేయ బిరుదులదాననా English(||pallavi||) e nomu nom̐sidino yiṁtagu munnu ānugŏni sevaseya naṁtadānanā (||||) sanavichchi nīvu nādo sarasamāḍevu gāga kanum̐gŏna nenaṁta sakkani dānanā panivaḍi nāmīm̐da pādamu sām̐sevu gāga tanuvu som̐kuḍagu naṁtaḍi dānanā (||||) nābai mannanam̐ gūḍa navvulu navvevu gāga nībŏṁdu liḍuseya nerubarinā tībanusu nāmovi tenĕlaḍigevu gāga ābanula kaṁtesi yaruhabu dānanā (||||) dayam̐ jūsinavāḍavai tagili kūḍevu gāga kriyado nīsittamĕrim̐gina dānanā niyadi śhrīveṁkaḍeśha nem̐ḍiṭṭe pĕṁḍlāḍidivi priyabaḍi yiṁtaseya biruduladānanā