Title (Indic)ఏ లోకమున లేఁడు యింతటి దైవము మరి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ లోకమున లేఁడు యింతటి దైవము మరి జోలిఁ దవ్వితవ్వి యెంత సోదించినాను (॥ఏలో॥) మంచిరూపున నెంచితే మరుని గన్నతండ్రి ఇంచుకంత సరిలేదు ఇతనికిని మించు సంపదలనైతే మేటిలక్ష్మీకాంతుఁడు పొంచి యీతనికి నీడు పురుఁడించఁగలరా (॥ఏలో॥) తగఁ బ్రతాపమునను దానవాంతకుఁ డితఁడు తగుల నీతని మారుదైవాలు లేరు పొగరు మగతనానఁ బురుషోత్తముఁ డితఁడు వెగటై యీతనిపాటి వెదకిన లేరు (॥ఏలో॥) పట్టి మొదలెంచితేను బ్రహ్మఁ గన్నతండ్రితఁడు మట్టున నింతటివారు మరి వేరి ఇట్టే శ్రీవేంకటేశుఁడీగికి వరదుఁడు ట్ట కొట్టఁగొన నితరుల గురిసేయఁగలరా English(||pallavi||) e logamuna lem̐ḍu yiṁtaḍi daivamu mari jolim̐ davvidavvi yĕṁta sodiṁchinānu (||elo||) maṁchirūbuna nĕṁchide maruni gannadaṁḍri iṁchugaṁta sariledu idanigini miṁchu saṁpadalanaide meḍilakṣhmīgāṁtum̐ḍu pŏṁchi yīdanigi nīḍu purum̐ḍiṁcham̐galarā (||elo||) tagam̐ bradābamunanu dānavāṁtagum̐ ḍidam̐ḍu tagula nīdani mārudaivālu leru pŏgaru magadanānam̐ buruṣhottamum̐ ḍidam̐ḍu vĕgaḍai yīdanibāḍi vĕdagina leru (||elo||) paṭṭi mŏdalĕṁchidenu brahmam̐ gannadaṁḍridam̐ḍu maṭṭuna niṁtaḍivāru mari veri iṭṭe śhrīveṁkaḍeśhum̐ḍīgigi varadum̐ḍu ṭṭa kŏṭṭam̐gŏna nidarula guriseyam̐galarā