Title (Indic)దండనున్న చెలుల మిందరము సాక్షి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దండనున్న చెలుల మిందరము సాక్షి నిండుదొర యీతనికి నేరమేమీ లేదు (॥దండ॥) వట్టి చలములు మాని వాకిలి దెరవరాదా యిట్టె విభుడుఁ వచ్చి యీడనున్నాఁడు వొట్టినట్టు కొలువై వుండినదొక్కటేకాని నెట్టన నితనివల్ల నేరమేమీ లేదు (॥దండ॥) దిచ్చరి కోపము మాని తెర దియ్యరాదా చొచ్చి వచ్చి రమణుఁడు చూచీ నిదే అచ్చముగ సరసములాడినదొక్కటే కాని నిచ్చలు నితనివల్ల నేరమేమీ లేదు (॥దండ॥) పంతపు వేసాలు మాని పయ్యెదెడలించరాదా చెంత శ్రీవేంకటేశుఁడు చేయి చాఁచీని యింతలోన నిన్నుఁ గూడె నిది యొక్కటే గాని నింతము సేసలితని నేరమేమీ లేదు English(||pallavi||) daṁḍanunna sĕlula miṁdaramu sākṣhi niṁḍudŏra yīdanigi neramemī ledu (||daṁḍa||) vaṭṭi salamulu māni vāgili dĕravarādā yiṭṭĕ vibhuḍum̐ vachchi yīḍanunnām̐ḍu vŏṭṭinaṭṭu kŏluvai vuṁḍinadŏkkaḍegāni nĕṭṭana nidanivalla neramemī ledu (||daṁḍa||) dichchari kobamu māni tĕra diyyarādā sŏchchi vachchi ramaṇum̐ḍu sūsī nide achchamuga sarasamulāḍinadŏkkaḍe kāni nichchalu nidanivalla neramemī ledu (||daṁḍa||) paṁtabu vesālu māni payyĕdĕḍaliṁcharādā sĕṁta śhrīveṁkaḍeśhum̐ḍu seyi sām̐sīni yiṁtalona ninnum̐ gūḍĕ nidi yŏkkaḍe gāni niṁtamu sesalidani neramemī ledu