Title (Indic)దండనున్న సతులెల్లా తలలు వంచుకొనేరు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దండనున్న సతులెల్లా తలలు వంచుకొనేరు కొండవంటి దొరవు సిగ్గులు దేర్చరాదా (॥॥) పచ్చడములోననే పాదాలొత్తీ నాపె నీకు గచ్చుఁజేఁతల నీవాపెఁ గరఁగించేవు పచ్చిదేరి మోవెల్ల భావపుఁ గళలు దాఁకీ ఇచ్చటనే ఆఁటదాని నింతసేతురా (॥॥) దోమతెరమాటుననే తూరి యాపె సేవ సేసీ చేముట్టి మర్మములంటి చిమ్మిరేఁచేవు మోమునఁ జొక్కులుదేరె మూసీ మంతనపురతిఁ గామిని నిందరిలోనఁ గడుఁగాకుసేతురా (॥॥) పూదండల సందినే పొదిగి కూడీ నాపె ఆదెసఁ జెమట నోలలార్చేవు నీవు తోదోపులనే వీడెఁ దురుము శ్రీవేంకటేశ సాదువంటిజవరాలి సారెఁ గాకుసేతురా English(||pallavi||) daṁḍanunna sadulĕllā talalu vaṁchugŏneru kŏṁḍavaṁṭi dŏravu siggulu dersarādā (||||) pachchaḍamulonane pādālŏttī nābĕ nīgu gachchum̐jem̐tala nīvābĕm̐ garam̐giṁchevu pachchideri movĕlla bhāvabum̐ gaḽalu dām̐kī ichchaḍane ām̐ṭadāni niṁtasedurā (||||) domadĕramāḍunane tūri yābĕ seva sesī semuṭṭi marmamulaṁṭi simmirem̐sevu momunam̐ jŏkkuluderĕ mūsī maṁtanaburadim̐ gāmini niṁdarilonam̐ gaḍum̐gāgusedurā (||||) pūdaṁḍala saṁdine pŏdigi kūḍī nābĕ ādĕsam̐ jĕmaḍa nolalārsevu nīvu todobulane vīḍĕm̐ durumu śhrīveṁkaḍeśha sāduvaṁṭijavarāli sārĕm̐ gāgusedurā