Title (Indic)దైవము సేసిన మాయ తగ నింతేసి కాఁబోలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవము సేసిన మాయ తగ నింతేసి కాఁబోలు నీ వొళ్లి కల్ల గాదు నిజమె యీ మాఁట (॥దైవము॥) చెప్పేవు సలిగెలు సేసేవు చేఁతలు అప్పుడు ఆతఁడు నిన్ను నంటె నంటాను కప్పురపుఁబడి తోడికాంత రెల్లా నుండఁగాను దెప్పరపువారికి యీ తెక్కు లేల వచ్చును (॥దైవము॥) సారె సారె నవ్వేవు సంగడిఁ గూచుండేవు దూరి ని న్నాతఁడు కాలు దొక్కె నంటాను చేరినట్టి సేసపాల చెలు లెల్ల నుండఁగాను పోరచిసతుల కేల బూటకాలు వచ్చునూ (॥దైవము॥) పెంచేవు పగటులు పెనచేవు వావులు ముంచి యొండొకమాటు ముట్టె నంటాను యెంచఁగ శ్రీవెంకటేశు నింటిదాననేఁ గూడితి పంచల నుండేవారికి బద్దు లేల వచ్చును English(||pallavi||) daivamu sesina māya taga niṁtesi kām̐bolu nī vŏḽli kalla gādu nijamĕ yī mām̐ṭa (||daivamu||) sĕppevu saligĕlu sesevu sem̐talu appuḍu ādam̐ḍu ninnu naṁṭĕ naṁṭānu kappurabum̐baḍi toḍigāṁta rĕllā nuṁḍam̐gānu dĕpparabuvārigi yī tĕkku lela vachchunu (||daivamu||) sārĕ sārĕ navvevu saṁgaḍim̐ gūsuṁḍevu dūri ni nnādam̐ḍu kālu dŏkkĕ naṁṭānu serinaṭṭi sesabāla sĕlu lĕlla nuṁḍam̐gānu porasisadula kela būḍagālu vachchunū (||daivamu||) pĕṁchevu pagaḍulu pĕnasevu vāvulu muṁchi yŏṁḍŏgamāḍu muṭṭĕ naṁṭānu yĕṁcham̐ga śhrīvĕṁkaḍeśhu niṁṭidānanem̐ gūḍidi paṁchala nuṁḍevārigi baddu lela vachchunu